Dosa: మసాలా దోశ ఆర్డర్ చేస్తే.. దోశ, మసాలా వేర్వేరుగా వచ్చిన వైనం.. వాటిని కస్టమర్ ఏం చేశాడో తెలుసా?

మసాలా దోశ ఆర్డర్ చేశాడు రాంకీ అనే వ్యక్తి. కానీ, రెస్టారెంటు వారు ఆలూ మసాలా, దోశను వేర్వేరుగా పంపించారు. దీంతో దోశను తిన్నాడు రాంకీ. ఆలూ మసాలాను ప్రిడ్జిలో పెట్టాడు. తదుపరి రోజు సొంతంగా దోశలు వేసుకుని, వాటిలో నిన్నటి ఆలూ మసాలా కలుపుకుని తిన్నాడు.

Dosa: ఆన్ లైన్లో ఆహార పదార్థాలు ఇచ్చి, తెప్పించుకుని తినేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అయితే, కొన్నిసార్లు ఇటువంటి కస్టమర్లకు విచిత్ర అనుభవాలు ఎదురవుతున్నాయి. దోశ(Dosa)లు అంటే భారతీయులకు చాలా ఇష్టం. ఫుడ్ డెలివరీ యాప్ లలో దోశ(Dosa)లకూ బాగా ఆర్డర్లు వస్తుంటాయి. తాజాగా, ముంబైకి చెందిన రాంకీ అనే వ్యక్తి దోశ ఆర్డర్ ఇచ్చాడు.

దోశల్లో మసాలా దోశ(Dosa), ఆనియన్ దోశ, పన్నీరు దోశ, సాదా దోశ, ఎగ్ దోశ ఇలా అనేక రకాలు ఉంటాయి. వాటిలో మసాలా దోశకు ఆర్డర్ ఇచ్చాడు రాంకీ. అయితే, ఒక్క పదార్థం ఆర్డర్ ఇస్తే రెండు పదార్థాలు వచ్చాయి. రెండు పదార్థాలు రావడం ఏంటని ఆ పార్సిళ్లను విప్పి చూశాడు.

ఒక దాంట్లో ఖాళీ దోశ, మరోదాంట్లో ఆలూ మసాలా (Aloo Masala) కనపడ్డాయి అతడికి. దోశలో ఆలూ మసాలా వేసి పంపకుండా రెస్టారెంట్ వాళ్ల, ఆ రెంటింటినీ వేర్వేరుగా పండడంతో ఆశ్చర్యపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాంకీ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.

“కృష్ణచైతన్య రెస్టారెంట్ నుంచి నేను నిన్న మసాలా దోశ ఆర్డర్ చేశాను. కానీ, వారు మసాలా, దోశను వేర్వేరుగా పంపించారు. నేను దోశను తిన్నాను. మసాలాను ప్రిడ్జిలో పెట్టాను. ఇవాళ సొంతంగా మసాలా దోశలు తయారు చేసుకున్నాను” అని చెప్పాడు. ఇవాళ సొంతంగా దోశలు వేసుకుని, వాటిలో నిన్నటి ఆలూ మసాలా కలుపుకుని తిన్నానని తెలిపాడు.

CM YS Jagan: పిల్లలకు మంచి మేనమామలా.. గోరుముద్దలో రాగిజావను ప్రారంభించిన సీఎం జగన్..

ట్రెండింగ్ వార్తలు