Navsari Natural Library : పచ్చని చెట్ల కింద ప్రకృతి ఒడిలో లైబ్రరీ .. 20 గ్రామాల యువతకు అదో రీడింగ్ హెవెన్‌

ఇంటి పెరడులో మామిడి చెట్టుకింద మంచం వేసుకుని పుస్తకం చదువుతుంటే ఎలా ఉంటుంది? ఓ జామ చెట్టుకింద మంచం వేసుకుని ప్రశాంతంగా చదువుకున్న జ్ఞాపకం కళ్లముందు కదలాడితే ఎలా ఉంటుందో అచ్చం అటువంటి అనుభూతులను కలిగిస్తుంది ఈ లైబ్రరి. ఇలా.. చెట్ల కింద కూర్చొని.. ఇష్టమైన పుస్తకాల్ని చదవడం ఓ కలలా అనిపిస్తుంది. కానీ.. ఆ కలను నిజం చేసి చూస్తే ఇదిగో ఇలా ఉంటుంది..

Navsari Natural Library : పచ్చని చెట్ల కింద ప్రకృతి ఒడిలో లైబ్రరీ .. 20 గ్రామాల యువతకు అదో రీడింగ్ హెవెన్‌

Navsari Natural Library  In Gujarat‌

Navsari Natural Library  In Gujarat‌: మీరు ఇప్పటిదాకా ఎన్నో లైబ్రరీలు చూసుంటారు. ఎన్నో రకాల గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదివి ఉంటారు. కానీ.. ఇలాంటి లైబ్రరీని మాత్రం చూసి ఉండరు. పచ్చని చెట్ల మధ్య ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా కూర్చుకుని ఓ పుస్తకం చదువుతుంటే ఎలా ఉంటుంది? వావ్ అనిపిస్తుంది కదూ.. ఓ మామిడి చెట్టుకింద మంచం వేసుకుని దానిమీద కూర్చుని పుస్తకం చదువుతుంటే అచ్చంగా స్వర్గంలో ఉన్నట్లే ఉంటుంది. పల్లెల్లో ఇంటి పెరడులో జామ చెట్టుకింద మంచం వేసుకుని ప్రశాంతంగా చదువుకున్న జ్ఞాపకం కళ్లముందు కదలాడుతుంది. అచ్చం అటువంటి అనుభూతులను కలిగిస్తుంది ఈ లైబ్రరి. ఇలా.. చెట్ల కింద కూర్చొని.. ఇష్టమైన పుస్తకాల్ని చదవడం ఓ కలలా అనిపిస్తుంది. కానీ.. ఆ కలను నిజం చేసి చూపించారు.

Kerala AI Camaras : దేశంలోనే తొలిసారి కేరళలో AI టెక్నాలజీ కెమెరాలతో చలాన్లు ..

గుజరాత్‌ (Gujarat‌)లోని నవ్‌సారి(Navsari)లో యువత. నవ్ సారి అనేది గుజరాత్ లో తొమ్మిదవ అతిపెద్ద నగరం. ఈ నగరంలో మోహన్ రీడింగ్ కాటేజ్ (Mohan Reading Cottage). నవ్‌సారి ప్రాంతంలోని దేవ్దా గ్రామం(Devda village)లో.. ఇలా ప్రకృతి మధ్య ఉంది. దేవ్దా గ్రామం పోరుబందర్ జిల్లాలో ఉంది. ఈ గ్రామంలో 4000మంది జనాభా ఉన్నారు. ఎక్కువమంది వ్యవసాయం చేస్తుంటారు. ఈ ప్రాంతంలోని చాలా మంది యువత.. ఇక్కడికొచ్చి పుస్తకాలు చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. పచ్చని చెట్ల కింద కూర్చొని.. నచ్చిన పుస్తకం చదవడం కొత్తగా ఉందని చెబుతున్నారు.

 

ఈ న్యాచురల్ లైబ్రరీ (NATURAL LIBRARY)ఉన్న దేవధా గ్రామం.. అంబికా నది ఒడ్డున ఉంది. ఈ ప్రాంతం అనేక మామిడి, చీకు చెట్లకు నిలయంగా ఉంది. ఈ న్యాచురల్ లైబ్రరీని ‘జై వాషి’ అనే వ్యక్తి ఏర్పాటు చేశారు. దానికి స్ఫూర్తి అతని తాత అని చెబుతారు. జైవాషి తాత మోహన్ వాశికి చదువటం అంటే చాలా ఇష్టం. పచ్చని చెట్ల మద్య కూర్చుని చదవటానికి ఇష్టపడేవారు. అలా తన తాత ఇచ్చిన స్ఫూర్తితో ఈ లైబ్రరిని ఏర్పాటు చేశారని చెబుతున్నారు. పచ్చని చెట్లు పక్షుల కిలకిలా రావాల మద్య లైబ్రరికి మంచి స్పందన వస్తోందని తెలిపారు. అలా మొదట్లో.. 2 వేల పుస్తకాలతో ప్రారంభమైన ఈ లైబ్రరీ. ఇప్పుడు.. చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాల యువతకు ఇదో రీడింగ్ హెవెన్‌ (Reading Haven)లా మారిపోయింది. పుస్తక ప్రియులంతా.. ఇక్కడికొచ్చి.. తమకు నచ్చిన పుస్తకాన్ని తీసుకొని.. ఇలా చెట్ల కింద.. ప్రశాంతమైన వాతావరణంలో చదువుకుంటూ ఉంటారు.

 

మొబైల్ స్టోర్‌లో.. మొబైల్ ఫోన్ల ఫీచర్లు ప్రదర్శించినట్లే.. ఈ లైబ్రరీలో పుస్తకాల ఫీచర్లు కూడా డిస్ ప్లేలో పెడతారు. అందువల్ల.. రీడర్స్ తమకు నచ్చిన పుస్తకాన్ని ఎంచుకునేందుకు వీలవుతుంది. అంతేకాదు.. యూత్‌ని అట్రాక్ట్ చేసేందుకు.. ఓ కేఫ్ కల్చర్ కాన్సెప్ట్‌(Cafe culture concept)ని కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడికొచ్చే వాళ్లు.. ఏదైనా రిఫ్రెష్‌మెంట్ అవసరమని భావిస్తే.. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, చాస్‌ని ఆర్డర్ చేసే సౌకర్యం కూడా ఉంది. వీటికి.. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగానే.. పాఠకులకు అందిస్తున్నారు. కొత్త తరాలను, యువతను.. పుస్తకాల వైపు ఆకర్షించాలనే లక్ష్యంతోనే.. ఈ మోహన్ రీడింగ్ కాటేజ్‌ను మొదలుపెట్టినట్లు.. నిర్వాహకులు చెబుతున్నారు.

Kolkata 100 Years Tea : ఈ టీ షాప్‌కి వందేళ్ల చరిత్ర .. రాగిపాత్రలో తయారు చేసే టీ ఫుల్ ఫేమస్..

ఈ న్యాచురల్ లైబ్రరీకి ఉన్న ఆదరణ.. కేవలం నవ్‌సారి ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. సోషల్ మీడియాలో చూసి.. ఇక్కడికి వచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అలాగే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్, వడోదర, సూరత్, ముంబై లాంటి ఇతర నగరాల నుంచి 12 వందల మందికి పైగా ప్రజలు.. ఈ ఫామ్ లైబ్రరీని సందర్శించారు. ఇక్కడి చెట్ల కింద కూర్చొని రిలాక్స్ అవుతూ.. తమకు నచ్చిన పుస్తకాలు చదివారు. ఈ న్యాచురల్ లైబ్రరీ.. ఎండాకాలం, శీతాకాలం సీజన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వర్షాకాలంలో దీనిని మూసేస్తారు. ముఖ్యంగా.. యువతను పుస్తక పఠనం మళ్లించేందుకు ఈ లైబ్రరీని ఏర్పాటు చేసిన వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయ్.