Police Band : సామాన్యుల ఇళ్లల్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు పోలీసుల బ్యాండ్ .. బుక్ చేసుకోండీ వచ్చి బ్యాండ్ బజాయిస్తామంటున్న పోలీసులు
ఎవరైనా, వివాహాలు చేసుకున్నా..లేదా ఇతర శుభకార్యాలు చేసుకుంటున్నా మాకు ఫోన్ చేసి బుక్ చేసుకోండి బ్యాండ్ వాయిస్తాం అంటున్నారు పోలీసులు. దీని కోసం ఓ మొబైల్ నంబర్ కూడా ఇచ్చారు పోలీసులు. పోలీసుల బ్యాండ్ సామాన్యులకు అవకాశం కల్పిస్తు వినూత్ననిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర పోలీసు శాఖ.

Police Band : ఎవరైనా, వివాహాలు చేసుకున్నా..లేదా ఇతర శుభకార్యాలు చేసుకుంటున్నా మాకు ఫోన్ చేసి బుక్ చేసుకోండి బ్యాండ్ వాయిస్తాం అంటున్నారు పోలీసులు. దీని కోసం ఓ మొబైల్ నంబర్ కూడా ఇచ్చారు పోలీసులు. పోలీసులేంటీ..శుభకార్యాలకు వచ్చి బ్యాండ్ వాయించటమేంటీ ఇదో సైడ్ బిజినెస్సా?ఏంటీ అని అనుకుంటున్నారా? ఏమైనా అనుకోండీ..కానీ పోలీసుల బ్యాండ్ మీ శుభకార్యాల్లో మోగాలన్నా..దద్దరిల్లిపోవాలన్నా కాస్త ఖర్చు పెట్టాల్సిందే.
సాధారణంగా ఇంట్లో శుభకార్యాలు జరిగితే బ్యాండ్ ఏర్పాటు చేసుకుంటాం కదా..అలా పోలీసులు కూడా బ్యాండ్ మేళం టీమ్ మేం గణతంత్ర, స్వాతంత్ర్య వేడుకల్లోనే కాకుండా పెళ్లిళ్లకు ఇతర శుభకార్యాలకు కూడా బ్యాండ్ వాయించే ఓవినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పంజాబ్ పోలీసు శాఖ..సాధారణంగా పోలీస్ బ్యాండ్‌ను గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లోనే వింటుంటాం. వీటికి మాత్రమే పోలీసులు బ్యాండ్ వాయిస్తారు. కానీ పంజాబ్ పోలీసు శాఖ మాత్రం ఇక నుంచి సామాన్యుల శుభకార్యాల్లోనూ పోలీస్ బ్యాండు వినే అవకాశాన్ని కల్పించింది…దీని కోసం ఓ మొబైల్ నంబర్ కూడా ఏర్పాటు చేసింది. మీ ఇంట్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉంటే ఈ నంబర్ కు ఫోన్ చేయండీ బుక్ చేసుకోండి అంటూ ప్రకటించారు పంజాబ్ లోని ముక్త్సార్ సాహిబ్ జిల్లా అధికారులు..దీని కోసం ఓ సర్క్యులర్ విడుదల చేశారు.
ఈ పోలీసు బ్యాండును వినియోగించుకోవాలంటే ముందుగా బుక్ చేసుకోవాలి. అలా బుక్ చేసుకుంటే గంటకు రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. బుకింగ్ చేసుకున్న టైమ్ దాటి మరింత సమయం పోలీసు బ్యాండ్ వినియోగించుకోవాలంటే మరింత డబ్బు చెల్లించాల్సిందే. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త వెసులుబాటు కల్పించింది పోలీసు బ్యాండ్ …నిర్ణీత సమయం దాటితే ప్రభుత్వ ఉద్యోగులకైతే రూ.2,500, సామాన్యులకు రూ.3,500 చొప్పున అదనంగా చెల్లించాలి. అంతేకాదు రవాణా ఖర్చులకు గాను కిలోమీటరుకు రూ.80లు చెల్లించాలని సర్క్యులర్ లో పేర్కొంది.
కుటుంబ వేడుకల కోసమైతే రూ.7,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ బ్యాండ్ బుకింగ్ కోసం పోలీస్ కంట్రోల్ రూమ్‌తో పాటు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబరు (8054942100)ను ఏర్పాటు చేశారు. మరి పోలీసు బ్యాండ్ సందడి కావాలంటే ఈ నంబర్ కు కాల్ చేయండీ అంటున్నారు పోలీసు బ్యాండ్ వారు..
దీనిపై విభిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. పంజాబ్ పోలీసు శాఖ విడుదల చేసిన ఈ సర్క్యలర్ పై శిరోమణి అకాలీదళ్ విమర్శలు చేస్తోంది. శిరోమణి అకాలీదళ్ ఎంపీ సుఖ్ బీర్ బాదల్ ట్విట్టర్ వేదికగా రాష్ట్రానికి నిధులు సమకూర్చుకోవటానికి పోలీసు శాఖ ఇలా పెళ్లిళ్లలకు,శుభకార్యాలకు బ్యాండులు వాయిస్తుందా? అంటూ ఎద్దేవా చేశారు.సీఎం భగవంత్ మాన్ సిగ్గుపడాలి.. ఇటువంటి దివాలాకోరు చర్యలకు అంటూ ఎద్దేవా చేశారు.
కాగా ఇలా పోలీసు బ్యాండ్ సర్క్యులర్ పై డీసీపీ అవతార్ సింగ్ మాట్లాడుతూ..ఈ బ్యాండ్ టీమ్ లో అసిస్టెంట్ సబర్ ఇన్ స్పెక్టర్ తో పాటు ఎనిమిదిమంది టీమ్ ఉంటుందని తెలిపారు. పెళ్లి లేదా ఇతర శుభకార్యాల్లో పోలీసు బ్యాండ్ ప్రదర్శించటం ఎంతమాత్రం తప్పులేదన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ విధానం జరుగుతోందని తెలిపారు.