Strange Village : ఆ గ్రామానికి ప్రత్యేక ప్రధాని, రాష్ట్రపతి, ప్రత్యేక కోర్టు ..! శివుడిని పూజించే గ్రామస్తులు గంజాయినే ప్రసాదంగా పెట్టే వింత సంప్రదాయం..!!

ఒక్కో దేశానికి ఒక్కో ప్రధాని.. ఒక్కో రాష్ట్రపతి ఉంటారు.. కాని ఆ ఊరికి మాత్రం ప్రత్యేకంగా ప్రధాని, రాష్ట్రపతి ఉంటారు.. వేరే ప్రపంచంతో వాళ్లకు సంబంధం లేదు.. అక్కడి ప్రజల విధానాలే వేరు.. ఎక్కడ ఏం జరుగుతున్నా వారికి అవసరం లేదు. ఆ ఊరే వారికి ప్రపంచం.. వాళ్లు బయటికి రారు.. పైగా ఈ ఊరున్నది మన దేశంలోనే.. ఎక్కడుందా ఊరు..అంటే మన భారతదేశంలోనే ఉందా గ్రామం.

Strange Village : ఆ గ్రామానికి ప్రత్యేక ప్రధాని, రాష్ట్రపతి, ప్రత్యేక కోర్టు ..! శివుడిని పూజించే గ్రామస్తులు గంజాయినే ప్రసాదంగా పెట్టే వింత సంప్రదాయం..!!

Strange village ‘The Republic of Malana’

Strange village ‘The Republic of Malana’ : ఒక్కో దేశానికి ఒక్కో ప్రధాని.. ఒక్కో రాష్ట్రపతి ఉంటారు.. కాని ఆ ఊరికి మాత్రం ప్రత్యేకంగా ప్రధాని, రాష్ట్రపతి ఉంటారు.. వేరే ప్రపంచంతో వాళ్లకు సంబంధం లేదు.. అక్కడి ప్రజల విధానాలే వేరు.. ఎక్కడ ఏం జరుగుతున్నా వారికి అవసరం లేదు. ఆ ఊరే వారికి ప్రపంచం.. వాళ్లు బయటికి రారు.. పైగా ఈ ఊరున్నది మన దేశంలోనే.. ఎక్కడుందా ఊరు..అంటే మన భారతదేశంలోనే ఉందా గ్రామం. అదే ‘ద రిపబ్లిక్‌ ఆఫ్‌ మలానా’..!

హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో పార్వతీ లోయను ఆనుకొని ఉంది మలానా గ్రామం. ఈ ఊరి రూటే సపరేటు.. ప్రపంచం అంతా ఓ దారిలో సాగుతుంటే… మలానా మాత్రం మరో దారిలో వెళ్తోంది. భవబంధాలకు దూరంగా, ఏకాంత దీవిలో తపస్సు చేసుకుంటున్న మునిలా ఓ కొండమీద కనిపిస్తుంది మలానా. ఇది ప్రపంచంలోని తొలి స్వయంపాలనా గ్రామాల్లో ఒకటి. బయటి ప్రపంచంతో మాకు సంబంధం లేదంటారు ఈ గ్రామస్తులు.. వీరు ఎవరినీ కలవరు.. తమలో మరెవరిని కలవనివ్వరు. చుట్టుపక్కల గ్రామస్థులతో మాట్లాడరు. పెళ్లి పేరంటాలకు వెళ్లరు. బంధుత్వాలను కలుపుకోరు..

Pregnancy tourism : ఆ గ్రామాల్లో అందగాళ్లు..వారితో పిల్లల్నికనటానికి విదేశీలనుంచి మహిళలు వస్తారట..!!
ఇంతేనా మలానా గ్రామానికి చాలా విశేషాలున్నాయి. ఆ గ్రామ పాలన, సామాజిక నిర్మాణం ప్రజాస్వామికంగా ఉంటాయి. గ్రామ కౌన్సిల్‌లో ఉండే పదకొండుమంది సభ్యులు పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఈ సభ్యులను తమ గ్రామ దేవతకి ప్రతినిధులుగా భావిస్తారు. దేశానికి ఒకే రాష్ట్రపతి, ఒకే ప్రధాని ఉంటే.. వీరికి మాత్రం ప్రత్యేక రాష్ట్రపతి, ప్రత్యేక ప్రధాన మంత్రి ఉంటారు.. అలాగే గ్రామంలో దిగువ న్యాయస్థానం, ఎగువ న్యాయస్థానం రెండూ ఉంటాయి. దిగువ కోర్టులో న్యాయం జరగలేదంటే ఎగువ కోర్టుకు వెళ్లొచ్చు. మలానా గ్రామానికి ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం ఉండదు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు అవసరం లేదు. ప్రభుత్వ ప్రతినిధులు వచ్చి ఏదైనా చెప్పబోయినా గ్రామస్తులు వినరు. తమకు నచ్చిన రీతిలోనే జీవిస్తారు. నిజానికి ఈ ఊళ్లో ప్రభుత్వ పాఠశాల ఉంది. వందమంది పిల్లలు చదువుకుంటున్నారు కూడా. కానీ అంతకుమించి ప్రభుత్వం ఇంకే విషయంలో జోక్యం చేసుకున్నా వీరికి నచ్చదు.

ఈ గ్రామానికి చెంది మరో వింత ఏంటంటే.. తమ గ్రామానికి చెందని వ్యక్తులు చేసే వంటకాలను వీరు స్వీకరించరు. ఇక్కడ ఇళ్లను, గోడలను, దేవాలయాలను బయటి వ్యక్తుల్ని తాకనివ్వరు. ఒకవేల తాకితే ఆ ప్రాంతాన్నంతా శుద్ధి చేస్తారు. అంతే కాదు ఇతర గ్రామాల వారిని వివాహం చేసుకోరు. పిల్లలకు పేర్లు పెట్టడంలో కూడా వీరికి తమదైన ప్రత్యేకత ఉంది. పుట్టిన రోజును బట్టి పేర్లు పెడతారు. ఆదివారం పుట్టినవారికి అహ్త అని, సోమవారం పుట్టిన వారికి సౌనరు అని, మంగళవారం పుట్టిన వారికి మంగల్ అని… ఇలాంటి పేర్లే పెడతారు. దాంతో ఒకే పేరుఉన్న వ్యక్తులు ఇక్కడ చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఈ ఊళ్లో మాట్లాడే భాష కనషీ. ఈ భాషలో సంస్కృత పదాలు ఎక్కువ ఉంటాయి. టిబెటన్ భాషల ప్రభావమూ కనిపిస్తుంది. అతి ప్రాచీనమైన ఈ భాషను ఆ గ్రామస్తులు తప్ప ఇతరులు అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. ఇలా ప్రతి విషయంలో స్వతంత్రంగా ఉండటం, తమ సొంత విధానాలను ఫాలో అవడం చూసే మలానాని కొందరు ద రిపబ్లిక్ ఆఫ్ మలానా అని కూడా పిలుస్తుంటారు.

వీరు శివుడిని పరమ పవిత్రంగా పూజిస్తారు.. మలానా లోయలో మహిమాన్వితమైన ఔషధాలున్నాయని ఒక నమ్మకం.. ఇక్కడ గంజాయిని శివుడి ప్రసాదంగా భావిస్తారు.. గంజాయి ఉత్పత్తిని తప్పుగా చూడరు.. గంజాయి మొక్క నుంచి సేకరించిన మలానా క్రీమ్‌ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్‌.. ఇక్కడి హషీష్‌ ఆయిల్‌కు కూడా చాలా డిమాండ్ ఉంది. ఎంతో నాణ్యతతో దీన్ని తయారు చేస్తారు. ఇక్కడ వైద్యం కోసం మాత్రమే గంజాయిని వాడతారు. అలెగ్జాండర్ సైనికుల వారసులు ఈ గ్రామాన్ని నిర్మించారని.. అందుకే వారు ఇంకెవరినీ తమలో కలుపుకోరని చెబుతుంటారు. కొండల నడుమ ఎంతో అందంగా ఉండే ఈ ఊరిని చూడడానికి విదేశాల నుంచి ఎక్కువగా టూరిస్టులు తరలివస్తుంటారు.