Sudha Murthy : నేను యూకే ప్రధాని అత్తగారినంటే నమ్మలేదు ‘జోక్‌ చేస్తున్నారా? అన్నారు : సుధామూర్తి

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి తమ లవ్ స్టోరీ గురించి ఇంటర్వ్యూలో చెబుతున్న వివరాలు ఆసక్తికరంగా మారాయి. నా కట్టుబొట్టు చూసి తాను యూకే ప్రధాని అత్తగారిని అంటే లండన్ అధికారులు నమ్మలేదంటూ చెప్పుకొచ్చారు.

Sudha Murthy : నేను యూకే ప్రధాని అత్తగారినంటే నమ్మలేదు ‘జోక్‌ చేస్తున్నారా? అన్నారు : సుధామూర్తి

Sudha Murthy

Sudha Murthy : సుధామూర్తి ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య. నారాయణమూర్తి భార్యగానే కాక రచయిత్రిగా మంచి పేరున్న మహిళ. అంతేకాదు సేవకార్యక్రమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహిళ. ‘పద్మభూషణ్‌’ పురస్కారం వరించిన వితరణశీలి.ఆమె ఇటీవల ఇంటర్వ్యూలో తన వివాహం నారాయణమూర్తి, తన మధ్య జరిగిన లవ్ స్టోరీలో జరిగిన సలు ఆసక్తికర సంఘటనలు తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో తమ వ్యక్తిగత విషయాలు వెల్లడిస్తు తాను యూకే వెళ్లిన సందర్భంగా ఇమ్మిగ్రేషన్‌ అధికారుల వద్ద తనకు ఎదురైన సంఘటను వివరించారు. తాను యూకే ప్రధాని అత్తగారిని అని చెబితే వారు నమ్మలేదని..తనను ఎగాదిగా చూసి ‘ఆర్యూ జోకింగ్’అంటూ విస్మయంగా నమ్మనట్లుగా చూశారని ప్రముఖ బాలీవుడ్‌ టాక్‌ షో ‘ది కపిల్‌ శర్మ షో’లో తెలిపారామె.

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణే అయినా సుధామూర్తి అత్యంత సాధాసీదాగా కట్టుబొట్టు తీరులో అచ్చమైన భారతీయ మహిళగా నిండుగా కనిపిస్తారు. బహుశా అందుకేనేమో తాను అంత సింపుల్ గా ఉండటం వల్ల వారు నమ్మలేదేమో అని నవ్వుతు తెలిపారు సుధామూర్తి. చీరకట్టులో హుందాగా సంప్రదాయంగా కనిపించటం వల్ల వారు గుర్తుపట్టలేదేమో. తన వస్త్రధారణ కారణంగా లండన్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని సుధామూర్తి తన ఇంటర్వ్యూలో చెబుతు… ‘ఇటీవలే నేను యూకే వెళ్లాను..లండన్ లో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు లండన్‌లో ఎక్కడ ఉంటారు? అని ప్రశ్నించారు. నా కుమారుడు యూకేలోనే ఉంటాడు. కానీ అతడి పూర్తి అడ్రసు నాకు తెలియదు.కాబట్టి నేను నా అల్లుడు రిషి సునాక్‌ నివాసమైన 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ను అడ్రస్‌గా రాశాను. అది చూడగానే ఇమ్మిగ్రేషన్‌ అధికారి నన్ను ఎగాదిగా చూసి.. ‘జోక్‌ చేస్తున్నారా?’ అని అడిగారు. అబ్బే నేను నిజమే చెబుతున్నానని చెప్పినా వారు నమ్మినట్లుగా అనిపించలేదు. ఇంత మహిళ ప్రధాని అత్తగారంటే అక్కడ ఎవరూ నమ్మలేదు’’ అని సుధామూర్తి చెప్పుకొచ్చారు.

Sudha Murthy Narayana Murthy Love story : ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి సుధాల లవ్ స్టోరీ .. ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పి సిగ్గుపడిన సుధామూర్తి

ఇటీవలే సుధామూర్తి తన కుమార్తెను చేసుకున్నందు వల్లే రిషి యూకే ప్రధాని అయ్యారని అన్నవిషయం తెలిసిందే. అలాగే తన లవ్ స్టోరీలో భాగంగా వివాహానికి ముందు నారాయణమూర్తిని మొదటిసారి చూడగానే హీరోలా ఉంటాడనుకుంటే చిన్నపిల్లాడిలా ఉన్నాడేంటీ అనుకున్నానంటూ ఆమె తన భర్త గురించి చెబుతు నవ్వేసారు..

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, సుధా మూర్తి దంపతుల కుమార్తె అక్షతామూర్తి యూకే ప్రధాని రిషి సునాక్ భార్య అనే విషయం తెలిసిందే. అనూహ్య పరిణామాల మధ్య రెండో సారి యూకే ఎన్నికలు జరుగగా భారతీయ మూలాలున్న వ్యక్తి రిషి సునాక్ యూకే ప్రధాని అయ్యారు. దీంతో భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు పాలించిన బ్రిటీషర్స్ దేశానికి భారతీయ వ్యక్తి ప్రధాని అయ్యారనే వార్తలు పతాకస్థాయికి చేరుకున్నాయి రిషి సునాక్ యూకే ప్రధాని అయ్యాక..