Summer: మీ ఎయిర్ కూలర్‌లో ఈ ఫీచర్లు ఉన్నాయా?

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడొస్తున్న కూలర్లు చాలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో రూపొందుతున్నాయి. లేటెస్ట్‌గా వస్తున్న కూలర్లలో ఉన్న ఆకట్టుకునే ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Summer: మీ ఎయిర్ కూలర్‌లో ఈ ఫీచర్లు ఉన్నాయా?

Summer

Summer: సమ్మర్ వచ్చిందంటే చాలా ఇళ్లలో కూలర్లు వాడుతుంటారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడొస్తున్న కూలర్లు చాలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో రూపొందుతున్నాయి. ఇంతకుముందులా పెద్ద బాక్స్ లాంటి డిజైన్‌తో ఎక్కువ స్పేస్ ఆక్రమించుకోకుండా, ఆకట్టుకునే డిజైన్స్‌తో చిన్న సైజ్‌లోనే కూలర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. లేటెస్ట్‌గా వస్తున్న కూలర్లలో ఉన్న ఆకట్టుకునే ఫీచర్ల గురించి తెలుసుకుందాం..
హ్యుమిడిటీ కంట్రోల్
పాత రకం కూలర్లు తేమ విషయంలో అంత సమర్ధవంతంగా పనిచేసేవి కావు. తేమ ఎక్కువగా పెంచేవి. కానీ, ఇప్పుడొస్తున్న కూలర్లతో ఈ సమస్య లేదు. కొత్త కూలర్లలో హ్యుమిడిటీ కంట్రోల్ ఫీచర్ ఉంది. దీని ద్వారా నిర్దిష్ట తేమ శాతానికి అనుగుణంగా వీటిని కంట్రోల్ చేయవచ్చు. కూలింగ్ ప్యాడ్స్‌పై వాటర్ ఫ్లోను అడ్జస్ట్ చేయడం వల్ల తేమ శాతాన్ని అదుపులో ఉంచవచ్చు.

Summer : వేసవిలో కాలంలో ఎన్ని లీటర్ల నీరు శరీరానికి అవసరమంటే?.

ఆటో ఫిల్ వాటర్
సాధారణంగా కూలర్లలో వాటర్ అయిపోతుండగానే, మళ్లీ వాటర్ నింపాలి. ఇలా రోజూ కనీసం రెండుసార్లైనా చేయాలి. అయితే, కొత్త కూలర్లలో ఈ బాధ లేకుండా ఆటో ఫిల్ ఫీచర్ వచ్చింది. దీని ద్వారా కూలర్‌లోని వాటర్ ట్యాంకులో నీళ్లు అయిపోగానే, దానికదే ఫిల్ చేసుకుంటుంది. ఈ ఫీచర్ వాడుకోవాలంటే కూలర్‌ను వాటర్ పైప్ లేదా మరేదైనా వాటర్ సోర్స్‌తో కనెక్ట్ చేయాలి.
ఆటో డ్రెయిన్
కూలర్‌లో నింపిన నీళ్లు అయిపోయే సమయానికి అవి మురికిగా తయారవుతాయి. అందుకే ఆ వాటర్ తీసేసి, మళ్లీ మంచి నీళ్లు నింపాలి. ఇలా ప్రతిసారీ నీళ్లు తోడెయ్యడం అదనపు పని. కానీ, కొత్త కూలర్లలో ఈ పని చేయాల్సిన అవసరం లేకుండా ఆటో డ్రెయిన్ ఫీచర్ వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మిగిలిపోయిన మురికి నీళ్లు, వాటికవే డ్రెయిన్ అవుతాయి.

Summer : వేసవిలో ద్రవాహారానికే పరిమితమౌతున్నారా? అయితే జాగ్రత్త
మస్కిటో నెట్
కొత్త కూలర్లలో మస్కిటో నెట్ లేదా ఇన్‌సెక్ట్ నెట్ ఉండటం వల్ల దోమలు, ఇతర పురుగులు వంటివి కూలర్లో చేరకుండా ఉంటాయి. దీని వల్ల కూలర్లలో కీటకాలు ఇరుక్కుని పాడయ్యే ఛాన్స్ ఉండదు.
వై-ఫై కనెక్టివిటీ
లేటెస్టుగా వస్తున్న కొన్ని అధునాతన కూలర్లలో వై-ఫై కనెక్టివిటీ కూడా ఉంది. కూలర్‌ను వై-ఫైతో కనెక్ట్ చేసుకుని, స్మార్ట్ ఫోన్‌తోనే ఆపరేట్ చేయొచ్చు.
వాయిస్ కమాండ్
కూలర్లు చాలా స్మార్ట్‌గా తయారవుతున్నాయి. అమెజాన్ అలెక్సా లేదా గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమాండ్‌తో కూలర్లు పనిచేసేలా చూడొచ్చు.

Summer : వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే కీరదోస!.
ఎయిర్ ఫిల్టర్లు
కొన్ని కూలర్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు కూడా ఉంటున్నాయి. ఇవి 2.5 ఎమ్ ఫిల్టర్ కెపాసిటీతో వస్తున్నాయి. ఈ కూలర్లు వాడితే గాలిలో దుమ్ము, ధూళి వంటివి లేకుండా ఉంటాయి.
టచ్ బటన్స్
కొన్ని కూలర్లకు టచ్ కెపాసిటీ కలిగిన రిమోట్ కంట్రోల్ కూడా వస్తుంది. ఈ రిమోట్‌తో టచ్ ద్వారానే కూలర్ కంట్రోల్ చేయొచ్చు.
మోటర్ ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్
కొన్నిసార్లు ఎలక్ట్రిక్ కెపాసిటీ ఉన్నట్లుండి పెరగడం లేదా తగ్గడం వల్ల మోటర్ ఓవర్‌లోడ్ అవుతుంది. దీని వల్ల మోటర్ పాడవుతుంది. ఈ ప్రాబ్లమ్ లేకుండా లేటెస్టుగా అనేక కూలర్లు మోటర్ ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్‌తో వస్తున్నాయి.
టెంపరేచర్ డిస్‌ప్లే
ఏసీల్లోనే ఉండే టెంపరేచర్ డిస్‌ప్లే ఫీచర్ ఇప్పుడు కూలర్స్‌లో కూడా వస్తోంది. దీని వల్ల యూజర్లు తమకు కావాల్సినట్లుగా టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు.