RTC Driver Emotion On Bus : స్టీరింగ్‌ను ముద్దు పెట్టుకుని,బస్సును కౌగిలించుకుని,క్లచ్, గేర్, బ్రేక్ తడుముతు ఆర్టీసీ డ్రైవర్ భావోద్వేగం

ఎంతో కాలంగా తనను నడిపిన సంస్థ బస్సుపై ఎంతో ప్రేమ పెంచుకున్నాడు డ్రైవర్. ఇద ఆ బస్సుతో రుణం తీరిపోయింది. చివరిసారిగా బస్సును చూసుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడు. స్టీరింగ్ ను ముద్దాడి, క్లచ్, గేర్, బ్రేక్.. ఇలా అన్నింటినీ ఆత్మీయంగా, ఆప్యాయంగా తడుముతూ, నమస్కరిస్తూ బస్సులోంచి కిందికి దిగారు. ఫుట్ బోర్డుకు కూడా నమస్కరించి, బస్సు ముందుకు వచ్చి రెండు చేతులు చాపి బస్సును కౌగలించుకుని కన్నకూతుర్ని కాపురానికి పంపించే తండ్రిలా కన్నీరు పెట్టుకున్నారు.

RTC Driver Emotion On Bus : స్టీరింగ్‌ను ముద్దు పెట్టుకుని,బస్సును కౌగిలించుకుని,క్లచ్, గేర్, బ్రేక్ తడుముతు ఆర్టీసీ డ్రైవర్ భావోద్వేగం

RTC Driver Emotion On Bus

Tamil Nadu RTC Driver Emotion On Bus : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసే డ్రైవర్లకు వారు నడిపే బస్సులపై మమకారం ఉంటుందా? బస్సును వారు సొంత మనిషిలా చూసుకుంటారా? రోజు తాము నడిపే బస్సు అంటే వారికి ప్రత్యేకమైన ప్రేమ ఉంటుందా? అంటే నిజమేననిపిస్తోంది తమిళనాడులో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసే ఓ డ్రైవర్ చేసింది చూస్తే. ఓ బస్సు డ్రైవర్ ఎన్నో ఏళ్లుగా తాను నడిపిన సంస్థ బస్సును కౌగలించుకుని..స్టీరింగ్ ను ముద్దు పెట్టుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అతను ఎందుకలా చేస్తున్నాడంటే..ఎన్నో ఏళ్లుగా తాను నడిపిన సంస్థ బస్సుకు తాను దూరమవుతున్నాడు..ఇక తాను ఆ బస్సును నడపలేడు. ఎందుకంటే అతను రిటైర్ అయ్యాడు. దీంతో ఆ బస్సుపై తనకున్న అభిమానాన్ని ఏదో సొంత మనిషిని వదిలి వెళుతున్నంతగా భావోద్వేగానికి గురి అయ్యాడు. బస్సును కౌగలించుకుని..స్టీరింగును ముద్దు పెట్టుకుని,క్లచ్, గేర్, బ్రేక్ అన్నింటిని ఎంతో ఆప్యాయంగా చేతులతో తడిమి తడిమి కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Plant Water Stress : నీరు లేకున్నా జీవించే మొక్కలు.. పశ్చిమ కనుమల్లో 62 జాతుల మొక్కలు గుర్తింపు

సాధారణంగా చాలామంది డ్రైవర్లు డ్యూటీ ఎక్కే సమయంలో ఎటువంటి ప్రమాదాలకు గురి కాకూడదని సురక్షితంగా ప్రయాణీకులకు గమ్యం చేరి అంతే సురక్షితంగా ఇంటికెళ్లాలని  స్టీరింగులకు దణ్ణం పెట్టుకుంటుంటారు. ఈ డ్రైవర్ మాత్రం తాను రిటైర్ అయిన సందర్భంగా ఆ బస్సుకు దూరమవుతున్నానని భావోద్వేగానికి గురి కావటం నెటిజన్ల హృదయాలను హత్తుకుంది.

 

తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థలో ముత్తుపాండి పరదవీ విరమణ పొందారు. ఎంతో కాలంగా తను నడిపిన సంస్థ బస్సుపై ఎంతో ప్రేమ పెంచుకున్నాడు. 60 ఏళ్ల ముత్తుపాండి డ్రైవర్ గా బస్సును ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. ప్రయాణీకుల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు పంపేవారు. కానీ 60 ఏళ్లు వచ్చాయి. ఇక ఈ సంస్థ బస్సులతో రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. పదవీవిరమణ సందర్భంగా ముత్తుపాండి చివరిసారిగా బస్సును చూసుకుంటూ కన్నీరు పెడుతున్న భావోద్వేగం అందరి మనసులను కదిలిస్తోంది. డ్రైవర్ ముత్తుపండి రిటైర్మెంట్ రోజు స్టీరింగ్ ను ముద్దాడి, క్లచ్, గేర్, బ్రేక్.. ఇలా అన్నింటినీ ఆత్మీయంగా, ఆప్యాయంగా తడుముతూ, నమస్కరిస్తూ బస్సులోంచి కిందికి దిగారు. ఫుట్ బోర్డుకు కూడా నమస్కరించి, బస్సు ముందుకు వచ్చి రెండు చేతులు చాపి బస్సును కౌగలించుకుని కన్నకూతుర్ని కాపురానికి పంపించే తండ్రిలా కన్నీరు పెట్టుకున్నారు.

 

Mamata Banerjee: రూల్స్ పాటిస్తూ హెల్మెట్ పెట్టుకుని, బైకు వెనుక సీట్లో కూర్చొని మమతా బెనర్జీ ప్రయాణం.. వీడియో

 

సంవత్సరాల తరబడి బస్సుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటితో బస్సును కౌగలించుకున్నారు. ఈరోజుతో నీకు నాకు ఉన్న అనుబంధానికి, బంధానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని కన్నీరు పెట్టుకున్నారు. ముత్తుపాండి ఇదంతా చేస్తుంటే తోటి ఉద్యోగులు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో అదికాస్తా వైరల్ అవుతోంది.