Turkey Earthquake : టర్కీ శిథిలాల్లో గుండెల్ని బరువెక్కించే దృశ్యం..పసిప్రాణాన్ని కాపాడామనే ఆనందంతో చిన్నారిని ముద్దాడిన రెస్క్యూ టీమ్

టర్కీ శిథిలాల్లో గుండెల్ని బరువెక్కించే దృశ్యాలు కోకొల్లలు,. ..పసిప్రాణాన్ని కాపాడామనే ఆనందం రెస్క్యూటీమ్ ముఖాల్లో కనిపిస్తోంది. విషాదంలోనే కాస్తంత ఆనందం. చిన్నిబిడ్డల ప్రాణాలను కాపాడామనే ఆనందం అది. అలా శిథిలాల్లోంచి కాపాడిన ఓ చిన్నారిని రెస్క్యూ టీమ్ ముద్దాడిని దృశ్యం వైరల్ గా మారింది.

Turkey Earthquake : టర్కీ శిథిలాల్లో గుండెల్ని బరువెక్కించే దృశ్యం..పసిప్రాణాన్ని కాపాడామనే ఆనందంతో చిన్నారిని ముద్దాడిన రెస్క్యూ టీమ్

Turkey Earthquake..rescuer kisses child on head

Turkey Earthquake : ప్రకృతి ప్రకోపిస్తే ఫలితం ఎలా ఉంటుందో టర్కీ, సిరియాలను చూస్తే తెలుస్తోంది. భూమి ప్రకోపించి ప్రాణాలను హరిస్తే ఎలా ఉంటుందో టర్కీ, సిరియాల భయోత్పాతాన్ని చూస్తే అర్థమవుతుంది. భూకంప శిథిలాల్లో ఎన్నో బతుకులు తెల్లారిపోగా..ప్రాణాలతో పోరాడుతు బయటపడతామో లేక తాము కూడా ఆ శిథిలాల్లోనే సజీవ సమాధి అయిపోతామో తెలియక ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రోజుల తరబడి ఎన్నో ప్రాణాలు ఎదురు చూస్తున్నాయి. కానీ ఏ ప్రాణం తమ సహాయం కోసం ఎదురు చూస్తుందో తెలియకపోయినా ప్రతీ ప్రాణాన్ని రక్షించాలనే తపనతో..తమ ప్రాణాలను పణ్ణంగా పెట్టి రెస్క్యూ టీమ్ అహర్నిశలు శ్రమిస్తున్నారు.

ముఖ్యంగా ఎంతోమంది చిరు ప్రాణాలు భూకంప శిథిలాల నుంచి బయటపడుతున్నాయి. అలా ఓ ప్రాంతంలో ఓ రెండేళ్ల చిన్నారిని అత్యంత జాగ్రత్తగా శిథిలాల నుంచి కాపాడారు రెస్క్యూ సిబ్బంది. ఒక్కో పసి ప్రాణాన్ని కాపాడుతుంటే ఆ చిన్నారులను చేతుల్లోకి తీసుకున్న ఆ రెస్క్యూటీమ్ మొహాల్లో ఆనందం తాండివిస్తోంది. హమ్మయ్యా..ఓ పసి ప్రాణాన్ని కాపాడం మా జన్మ ధన్యమైంది అన్నట్లుగా భావిస్తున్నారు. పసిబిడ్డల్ని శిథిలాల్లోంచి బయటకు తీసాక వారి భావోద్వేగానికి ప్రతీకలా నిలిచే ఓ దృశ్యం చూస్తే గుండెలు చిక్కబట్టుకుపోవటం ఖాయం. అలా టర్కీలోని భూకంప శిథిలాల్లోంచి ఓ రెండేళ్ల చిన్నారిని రక్షించిన రెస్క్యూటీమ్ ఆ చిన్నారిని అత్యంత జాగ్రత్తగా..అపురూపంగా చేతుల్లోకి తీసుకుని చిన్నారి బుగ్గపై ముద్దు పెట్టిన అత్యంత అరుదైన గొప్ప దృశ్యం సోషల్ మీడియాలో హృదయాలను బరువెక్కిస్తోంది. ముద్దులొలికే ఆ చిన్నారిని బయటకు సురక్షితంగా తీసాకు ఆ తర్వాత వైద్యం కోసం స్ట్రెచర్‌పై తీసుకెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది.

టర్కీ మరియు సిరియాలో సంభవించిన విపత్తు భూకంపంలో చిక్కుకున్న లక్షలాది మంది పిల్లలను చూపించే అనేక భయానక చిత్రాలు సోషల్ మీడియాలో హృదయాలను కలచివేస్తున్నాయి. సిరియాలో శిథిలాల నుండి రక్షించబడిన నవజాత శిశువు తన బొడ్డు తాడుతో ఇప్పటికీ తన తల్లికి అనుసంధానించబడి చనిపోయిందని చూపించే ఫోటో ఇటువంటివి చూడాల్సి వస్తుందే అనే గుండెల్ని పిండేస్తున్నాయి. ఇటువంటి ఎన్నో..ఎన్నెన్నో గాథలకు సాక్ష్యాలుగా భూకంప శిథిలాలు ప్రకృతిప్రకోపానికి నిలువుటద్దాలుగా కనిపిస్తున్నాయి.

టర్కీ శిథిలాల్లో గుండెల్ని బరువెక్కించే దృశ్యాలు కోకొల్లలుగా కానవస్తున్నాయి.పసిప్రాణాన్ని కాపాడామనే ఆనందం రెస్క్యూటీమ్ ముఖాల్లో కనిపిస్తోంది. విషాదంలోనే కాస్తంత ఆనందాలు అవి. చిన్నిబిడ్డల ప్రాణాలను కాపాడామనే ఆనందం అది. అలా శిథిలాల్లోంచి కాపాడిన ఓ చిన్నారిని రెస్క్యూ టీమ్ ముద్దాడిని దృశ్యం వైరల్ గా మారింది.