UK Teenage Love Story : అద్భుతమైన ‘ప్రేమ’కథ .. 19 ఏళ్లలో ప్రేమ, 79 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న ప్రేమికులు

ఇంగ్లాండులో 1963లో జరిగిన ఓ అత్యధ్భుతమైన ప్రేమకథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 19 ఏళ్లలో ప్రేమించుకుని 79 ఏళ్లలో పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంట కథ అద్భుతమంటున్నారు నెటిజన్లు..

UK Teenage Love Story : అద్భుతమైన ‘ప్రేమ’కథ .. 19 ఏళ్లలో ప్రేమ, 79 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న ప్రేమికులు

UK Teenage Love Story : సినిమాల్లో ప్రేమకథలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రేమజంట విడిపోవటం వారికి వేరే వేరే వ్యక్తులతో వివాహం కావటం వారు తమ ప్రేమను మర్చిపోలేక..వివాహం చేసుకున్నవారితో కలిసి సంతోషంగా జీవించలేక పడే మానసిక వేదన దృశ్యాలు కాసుల వర్షం కురిపిస్తుంటాయి. అయినా ప్రేమ ఎప్పుడైనా ఎక్కడైనా గొప్పదే. ప్రేమకు వయస్సుతో పనిలేదు. అందుకే బ్రిటన్ లో ఓ ప్రేమజంట ‘ప్రేమ’ను 60 ఏళ్ల తరువాత వివాహంతో పదిలం చేసుకున్నారు. ఈ వయసులో పెళ్లేంటీ అనుకోవచ్చు. కానీ ప్రేమకు,పెళ్లికి వయస్సుతో పనిలేదు. ఇద్దరు టీనేజ్ లో ఉండగా ప్రేమించుకున్నారు. కానీ వారి వారి కుటుంబాల్లో అంగీకరించలేదు. ఇది సర్వసాధారణంగా జరిగేదే సినిమాల్లోను..నిజ జీవితాల్లో కూడా.

Marriage Age: వివాహం వయస్సు బిల్లుపై చర్చించటానికి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో మహిళల సంఖ్య పెంచండి

ఇంగ్లండ్ కు చెందిన లెన్ ఆల్‌బ్రైటన్, జీనెట్ స్టీర్ అనే ఇద్దరికి కూడా అదే జరిగింది. కానీ వారికి వేరే వారితో వివాహం జరిపించారు పెద్దలు. కానీ తమ ప్రేమను మాత్రం మర్చిపోలేదు లెన్, జీనెట్ లు..అలా వారు 60 ఏళ్ల తరువాత తమ ప్రేమను గెలిపించుకున్నారు. 70 ఏళ్లు దాటిన ఇద్దరు వివాహంతో ఒక్కటయ్యారు.

94 yrs women wedding gown : 94 ఏళ్లకు ‘పెళ్లి గౌను’ కోరిక నెరవేర్చుకున్న బామ్మ

ఇంగ్లాండులో 1963లో జరిగిన ఓ అత్యధ్భుతమైన ప్రేమకథ ఇటీవల బయటికొచ్చింది. 19 ఏళ్ల లెన్,18 ఏళ్ల జీనెట్ ప్రేమించుకున్నారు. 1963 లో న్యూ పోర్ట్ లోని సెయింట్ మెరిన్ హాస్పిటల్ లో పనిచేస్తున్న సమయంలో ఇద్దరు మనస్సులో కలిసాయి. అప్పటికి లెన్ వయస్సు 19, జీనెట్ వయసు 18. గాఢంగా ప్రేమించుకున్న వీరిద్దరు వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ పెద్దవాళ్లు అంగీకరించలేదు. వారిని ఎదిరించి వివాహం చేసుకోవటానికి ఇద్దరు మైనర్లు..దీంతో వీరి వివాహం జరగలేదు.ఆ తరువాత ఇద్దరికి వేరే వేరే వివాహాలు జరిగాయి. పెళ్లి చేసుకున్ లెన్ ఇంగ్లాండ్ లోను.. జీనెట్ ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయారు. అలా వారి ప్రేమకథ మరుగునపడిపోయింది.

వివాహం అయిన లేన్ కు ముగ్గురు పిల్లలు. భార్య చనిపోయింది. 60 ఏళ్ల తరువాత లేన్ ఆస్ట్రేలియా నుండి ప్రియరాలను వెతుక్కుంటూ ఇంగ్లాండ్ కు వచ్చాడు. కానీ ఆమెనుకలుసుకోవటానికి భయపడ్డాడు. తనను గుర్తుపడుతుందో లేదో..గుర్తు పడితే ఎలా స్పందిస్తోనని ఆందోలన చెందాడు.కానీ ఇంతదూరం వచ్చాక ఆమెను కలుసుకోకుండా వెనక్కి వెళ్లేది లేదని నిర్ణయించుకుని ఎట్టకేలకు ప్రియారాలను కలిసాడు. 60 ఏళ్ల తరువాత వారిద్దరు ఎదురెదురు పడిన క్షణాలు ఆస్వాదించారు. ఇద్దరు ఓ క్షణం మైమరచిపోయారు. ఆమె యోగక్షేమాలు అడిగాడు. భర్త క్యాన్సర్ తో చనిపోయాడని ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసుకున్నాడు.

Child Marriage: ఏడాది వయసులోనే వివాహం.. చిన్నారి పెళ్లిని 20 ఏళ్లకు రద్దు చేసిన కోర్టు

ఇద్దరి జీవితాలు ఒకేలా ఉన్నాయి..మన బాథ్యలు తీరిపోయాయి మరి మనం ఇప్పటికైనా పెళ్లి చేసుకుందామా? అని అడిగాడు. దానికి ఆమె మనస్సు పరిపరివిధాలుగా ఆలోచించింది. కానీ తన ప్రేమికుడిని మరోసారి వదలుకోకూడదనుకుంది. అలా ఆమెను ఒప్పించిన లేన్, జీనెట్ లు 2023లో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ప్రస్తుతం లేన్ వయస్సు 79, జీనెట్ – 78…పెళ్లికి, ప్రేమకు వయస్సుతో పనిలేదని మరోసారి నిరూపించారు ఈ ప్రేమజంట…

Marriage Age : 18 ఏళ్లకే ఓటేస్తున్నారు..అదే వ‌య‌స్సులో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు..?