Uttar Pradesh : భార్యను దోమలు కుడుతున్నాయని భర్త ఫిర్యాదు.. మస్కిటో కిల్లర్‌ తెచ్చి ఇచ్చిన పోలీసులు

నా భార్యను దోమలు కుడుతున్నాయని యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు...దీంతో పోలీసులు ఆ యువకుడికి మస్కిటో కిల్లర్‌ తెచ్చిచ్చారు.

Uttar Pradesh :  భార్యను దోమలు కుడుతున్నాయని భర్త ఫిర్యాదు.. మస్కిటో కిల్లర్‌ తెచ్చి ఇచ్చిన పోలీసులు

Uttar Pradesh : ‘నా భార్యను దోమలు కుడుతున్నాయ్ సార్’ అంటూ ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన వింత ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఈ ఫిర్యాదే వినూత్నంగా ఉందంటే.. పోలీసులు స్పందించిన తీరు కూడా ఇంకా గొప్పగా ఉంది. సాధారణంగా మా పిల్లలు కనిపించటంలేదని ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోని పోలీసులు ఓ యువకుడు ‘నా భార్యను దోమలు కుడుతున్నాయ్ సార్’ అంటూ ఓ యువకుడు ట్విట్టర్ ద్వారా చేసిన ఫిర్యాదుకు పోలీసులు కూడా మానవత్వంతో స్పందించారు యూపీ పోలీసులు. ఫిర్యాదు చేసిన యువకుడికి మస్కిటో కిల్లర్‌ తెచ్చిఇచ్చారు యూపీలోని సంభల్‌ జిల్లాకు చెందిన పోలీసులు..

సంభల్‌ జిల్లాకు చెందిన అసద్‌ఖాన్‌ అనే యువకుడి భార్య గత ఆదివారం (మార్చి 19,2023) రాత్రి చందౌసిలోని ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్ లో ప్రసవించింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ ఆసుపత్రిలో దోమల సమస్య విపరీతంగా ఉంది. అసద్‌ భార్యను, అప్పుడే పుట్టిన బిడ్డ దోమలు కుట్టటంతో ఆందోళన చెందాడు అసద్. దోమలు కుట్టిన బిడ్డ ఏడుపుని చూసిన అసద్ బాధపడిపోయాడు. భార్యాబిడ్డల బాధ చూడలేక అసద్ మస్కిటో కిల్లర్‌ కోసం బయటకు వెళ్లాడు. అప్పటికే అర్ధరాత్రి అయిపోయింది. షాపులన్నీ మూసివేశారు. దీంతో అసద్ చాలాసేపు భార్యాబిడ్డలను దోమలు కుట్టకుండా విసురుతు కూర్చున్నాడు. కానీ ఎంతసేపు ఇలా అనుకున్నాడు.

ఇక చేసేదిలేక ‘నా భార్యా బిడ్డలను దోమలు కుట్టేస్తున్నాయ్ సార్’ అంటూ యూపీ పోలీసులకు ట్వీట్‌ చేశాడు. డయల్‌ 112 ట్విటర్‌ ఖాతాకు ట్యాగ్‌ చేశాడు. వెంటనే స్పందించి ఆసుపత్రికి వచ్చి మరీ అసద్‌ఖాన్‌కు మస్కిటో కిల్లర్‌ను అందించారు పోలీసులు. అంతేకాకుండా యూపీ పోలీసులు తమదైన శైలిలో ‘‘మాఫియా నుంచి మస్కిటో వరకు దేన్నైనా ఎదుర్కొంటాం’’ అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.