Drunk man: తప్పతాగి బావిలో పడ్డ భర్త.. బావిలోనే ఉన్నాడని 4 రోజుల తర్వాత గుర్తించిన భార్య

అతడి పేరు యోగేంద్ర యాదవ్. అప్పుడప్పుడు మద్యం తాగేవాడు. ఆ మత్తులో ఏం చేస్తున్నాడో అతడికే తెలిసేది కాదు. ఇటీవల మద్యం తాగి, ఆ మైకంలో బావిలో పడిపోయాడు. యోగేంద్ర యాదవ్ బావిలో ఉన్నాడని అతడి భార్య నాలుగు రోజుల తర్వాత గుర్తించింది. దీంతో యోగేంద్ర చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లోని ఛర్రా ప్రాంతంలో చోటుచేసుకుంది.

Drunk man: తప్పతాగి బావిలో పడ్డ భర్త.. బావిలోనే ఉన్నాడని 4 రోజుల తర్వాత గుర్తించిన భార్య

Drunk man

Drunk man: అతడి పేరు యోగేంద్ర యాదవ్. అప్పుడప్పుడు మద్యం తాగేవాడు. ఆ మత్తులో ఏం చేస్తున్నాడో అతడికే తెలిసేది కాదు. ఇటీవల మద్యం తాగి, ఆ మైకంలో బావిలో పడిపోయాడు. యోగేంద్ర యాదవ్ బావిలో ఉన్నాడని అతడి భార్య నాలుగు రోజుల తర్వాత గుర్తించింది. దీంతో యోగేంద్ర చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లోని ఛర్రా ప్రాంతంలో చోటుచేసుకుంది.

యోగేంద్ర యాదవ్ ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తాజాగా, పని ముగించుకుని హోటల్ కు వెళ్లి భోజనం చేసి, అక్కడి నుంచి మద్యం దుకాణానికి వెళ్లి పీకలదాకా తాగాడు. అనంతరం మూత్రం పోయడానికి బావి వద్దకు వెళ్లాడు. బాగా తాగడంతో నియంత్రణ కోల్పోయి బావిలో పడిపోయాడు. అతడు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా గాలించారు. అతడు ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోయారు.

Engineer sisters Video: ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకున్న అక్కాచెల్లెళ్లు.. ఒకే పూలదండ వేస్తూ…

దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి వెతికినా యోగేంద్ర యాదవ్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియరాలేదు. నాలుగు రోజుల తర్వాత యోగేంద్రను వెతకడాన్ని కొనసాగిస్తూ అతడి భార్య శ్రద్ధ హోటల్ పరిసర ప్రాంతానికి వెళ్లింది. తన భర్త స్వెటర్ బావిలో పడి ఉన్నట్లు గుర్తించింది.

స్థానికులను పిలిచి ఆ విషయం చెప్పింది. బావిలో ఉన్న యోగేంద్రను అందరూ కలిసి బయటకు లాగారు. స్పృహ కోల్పోయి ఉన్న యోగేంద్రను ఆసుపత్రికి తరలించారు. అతడు నాలుగు రోజుల పాటు బావిలోనే ఉన్నప్పటికీ ప్రాణాలతో బయటపడడం గమనార్హం. భర్త ఎక్కడున్నాడో గుర్తు పట్టి, అతడి ప్రాణాలు కాపాడిన శ్రద్ధను గ్రామస్థులు అభినందించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..