Virat Kohli: కీర్తి దక్కాలన్న కోరిక ఓ రోగంతో సమానం: విరాట్ కోహ్లీ
‘‘కీర్తి దక్కాలన్న కోరిక ఓ రోగంతో సమానం. ఏదో ఒక రోజు నేను ఈ రోగం నుంచి, ఈ కోరిక నుంచి విముక్తి పొందుతాను. కీర్తి అనేది ఓ విషయమే కాదు. జీవితాన్ని అనుభవించడం, బాగుండడం చాలు’’ అంటూ దివంగత సినీనటుడు ఇర్ఫాన్ ఖాన్ గతంలో చేసిన వ్యాఖ్యలను కోహ్లీ పోస్ట్ చేశాడు.

Virat Kohli: ‘కీర్తి దక్కాలన్న కోరిక ఓ రోగంతో సమానం’ అంటూ ఓ సూక్తిని పోస్ట్ చేశాడు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ. బంగ్లాదేశ్ తో సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక-భారత్ వన్డే సిరీస్ లో అతడు ఆడనున్నాడు. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీ పోస్ట్ చేశాడు కోహ్లీ.
‘‘కీర్తి దక్కాలన్న కోరిక ఓ రోగంతో సమానం. ఏదో ఒక రోజు నేను ఈ రోగం నుంచి, ఈ కోరిక నుంచి విముక్తి పొందుతాను. కీర్తి అనేది ఓ విషయమే కాదు. జీవితాన్ని అనుభవించడం, బాగుండడం చాలు’’ అంటూ దివంగత సినీనటుడు ఇర్ఫాన్ ఖాన్ గతంలో చేసిన వ్యాఖ్యలను కోహ్లీ పోస్ట్ చేశాడు.
అలాగే, మరో వీడియోను కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు కోహ్లీ. ‘‘ఈ కాలం వెళ్లిపోతుంది.. నువ్వు బాధలో ఉన్నా, చిరాకులో ఉన్నా, కోపంగా ఉన్నా.. ఈ కాలం వెళ్లిపోతుంది’’ అని అందులో వినపడుతోంది. కాగా, ఇటీవలే కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో న్యూ ఇయర్ సందర్భంగా ఫొటోను పోస్ట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కోహ్లీకి 23 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సాధారణంగా సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్లు తమకు క్రికెటే ప్రాణమని, జీవితమని చెప్పుకుంటారు. కానీ, కోహ్లీ మాత్రం తనకు క్రికెటే జీవితం కాదని గతంలో చెప్పాడు.