Viral Video : యువకుడు కళ్లజోడు ఎత్తుకుపోయిన కోతి, మర్కటానికే మస్కా కొట్టించిన యువతి

అన్నీ కోతి పనులే.. వాటికి నచ్చిందంటే ఏవీ వదలవే..ఓ కోతికి ఓ వ్యక్తి పెట్టుకున్న కళ్లజోడు నచ్చింది. నీకెందుకులేవయ్యా..నీకంటే నాకే బాగుంటుంది అనుకుందో ఏమో వెనకాలే వచ్చిచటుక్కున అతని కళ్లజోడు ఎత్తుకుపోయింది. దాంతో బిత్తరమొహం వేసుకున్న చూస్తుంటే మర్కటానికే మస్కా కొట్టిందో యువతి..

Viral Video : యువకుడు కళ్లజోడు ఎత్తుకుపోయిన కోతి, మర్కటానికే మస్కా కొట్టించిన యువతి

take back glasses from a monkey

Monkey Viral Video: అన్నీ కోతి పనులే అంటారు పిల్లలు ఏమన్నా అల్లరి పనులు చేస్తే.కోతులు తమకు నచ్చినవాటిని భలే ఎత్తుకుపోతాయి. ఫోన్ ఎత్తుకుపోవటాలు,కళ్లజోడు ఎత్తుకుపోవటం వంటి వైరల్ వీడియోలో సోష‌ల్ మీడియాలో చూస్తుంటాం. అలాగే ఓ కోతి ఓ యువకుడు తన దారి తాను పోతుంటే వెనకాలే వచ్చి చటుక్కున అతని కళ్లజోడు ఎత్తుకుపోయింది. అతను గిరుక్కున వెనుతిరిగి చూసేటప్పటికే ఆకోతి ఆకళ్లజోడును తన కళ్లకు పెట్టేసుకుంది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది.

కోతి తెలివిగా తీసేసుకున్న క‌ళ్ల‌జోడును తిరిగి పొందేందుకు ఓ మ‌హిళ చూపిన చాకచక్యం చూస్తే వారెవ్వా మర్కటానికే మస్కా భలే కొట్టిందే అనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు మ‌హిళ స‌మ‌యస్ఫూర్తికి ఫిదా అవుతున్నారు. ఈ వీడియోలో ఓ వ్య‌క్తి క‌ళ్ల‌జోడు పెట్టుకుని మెట్ల‌ను ఎక్కుతుండ‌గా అపక్కనే గోడ మీద నుంచి తాపీగా నడుచుకుంటు వచ్చిన ఓ కోతి చటుక్కున ఆ వ్య‌క్తి క‌ళ్ల‌జోడును గుంజుకుని వెనక్కి వెళ్లి అంతే తాపీగా ఓ మూల కూర్చుండ‌టం క‌నిపిస్తుంది. క‌ళ్ల‌జోడును కోతి ఆస‌క్తిగా ప‌రిశీలిస్తుండ‌గా ఓ మ‌హిళ కోతి దగ్గరగా వెళ్లి ఓ పండు ఇస్తుంది. దాన్ని కోతి తీసుకుంటుంది.మరో పండు ఇస్తుందామె. దాంతో కోతి కళ్లు జోడు కింద పెట్టి ఆ రెండో పండును అందుకుంటుంది.

అంతే ఆమె కళ్లజోడు తీసుకుని వచ్చేస్తుంది. కోతి దృష్టి పండ్లమీద ఉండగానే ఇదే అద‌నుగా మ‌హిళ క‌ళ్ల‌జోడును దాన్నుంచి తీసుకుని ఆ వ్య‌క్తికి ఇచ్చేస్తుంది.ఈ వీడియోను ఏకంగా ప‌ది ల‌క్ష‌ల మంది వీక్షించ‌గా పెద్ద‌సంఖ్య‌లో నెటిజ‌న్లు వారెవ్వా ఆమెది భలే తెలివిగా మర్కటాన్ని మస్కా కొట్టించింది అంటున్నారు.