గుడ్ బై సుశాంత్: ఫౌండేషన్ ఏర్పాటు చేయనున్న ఫ్యామిలీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్‌ను‌ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు బాలీవుడ్‌ నటుడు, దివంగ‌త‌ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం నేడు అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ ఫౌండేష‌న్‌ ద్వారా సినిమా, సైన్స్, స్పోర్ట్స్ త‌దిత‌ర రంగాల్లో ప్ర‌తిభ‌చాటే యువ‌త‌కు ఆర్థికసాయం అందించ‌నున్న‌ట్లు తెలిపారు. దీనితోపాటు బీహార్‌లోని పాట్నాలో గ‌ల సుశాంత్ ఇంటిని స్మారక చిహ్నంగా మార్చనున్నట్లు పేర్కొన్నారు.

దీనిలో సుశాంత్‌కు సంబంధించిన వ్యక్తిగత వ‌స్తువులు అభిమానులు తిల‌కించేందుకు ఏర్పాటు చేయనున్న‌టు తెలిపారు. అదేవిధంగా సుశాంత్ కుటుంబ స‌‌భ్యులు అతని ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్,ఫేస్‌బుక్ పేజీని నిర్వహించ‌నున్నారు. త‌ద్వారా అతని జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయ‌ని వారు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు సుశాంత్ కుటుంబ సభ్యులకు తమ సంతాపం తెలుపుతూ వారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందిస్తున్నారు.

Read: గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన హాస్యబ్రహ్మ, అడవి శేష్

Related Posts