14ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన 70ఏళ్ల వృద్ధుడు, 6 నెలలుగా అత్యాచారం

old man rapes girl in medak

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన 70ఏళ్ల వృద్ధుడు ఓ బాలికను గర్భవతిని చేశాడు. మనవరాలి వరసైన బాలికను ఆరు నెలలుగా ఆత్యాచారం చేశాడు. బాలిక మూడు నెలల గర్భవతి కావటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్‌ జిల్లా నత్నాయిపల్లి గ్రామానికి చెందిన రుద్రయ్య కుటుంబం జిన్నారం మండలం కిష్టాయిపల్లి గ్రామానికి 12ఏళ్ల క్రితం వలస వచ్చింది. రుద్రయ్యకు కొడుకు, 14 ఏళ్ల కూతురు ఉన్నారు. కుటుంబ పోషణ భారం కావడంతో తన కూతురిని అదే గ్రామంలో నివాసం ఉంటున్న సుమారు 70ఏళ్ల బషెట్టిగారి దయానంద్‌ ఇంట్లో పని మనిషిగా చేర్చాడు రుద్రయ్య. 

బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం:
వయసు మీదపడ్డా కామంతో కళ్లు మూసుకుపోయి దయానంద్ నీచానికి ఒడిగట్టాడు. బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు‌. అయితే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేందుకు బాలిక భయపడింది. ఇదే అదునుగా ఆరు నెలలగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు దయానంద్. 

బాలికకు కడుపు నొప్పి, వాంతులు:
వారం రోజుల నుంచి బాలికకు తీవ్రమైన కడుపు నొప్పితో పాటు వాంతులు అవుతుండడంతో తండ్రి రుద్రయ్య ఆందోళన చెందాడు. వెంటనే కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లి డాక్టర్లకు చూపించాడు. బాలిక 3 నెలల గర్భవతి అని డాక్టర్లు చెప్పడంతో అతడు షాక్ తిన్నాడు. అసలేం జరిగిందని కూతురిని అడిగితే అసలు విషయం వెలుగుచూసింది. దీనిపై రుద్రయ్య బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read: గర్భవతిని చేశాక కులం గుర్తొచ్చింది, న్యాయం కోసం యువతి పోరాటం

మరిన్ని తాజా వార్తలు