లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

అలనాటి క్వారంటైన్స్ : వైరసులు, బ్యాక్టిరీయాలను వందల ఏళ్ల క్రితం ప్రజలు ఎలా తరమికొట్టారు?

Published

on

వైద్య రంగానికి ఎప్పుడూ సవాళ్లు ఎదురవుతూనేవుంటాయి. కొత్త రోగాలు వస్తే మందు కనిపెట్టాలి.. రాకుండా వ్యాక్సిన్ ను కనుక్కోవాలి. ఎక్కడ ఎలాంటి వైరస్ పుట్టుకొచ్చినా దాన్ని అంతమొందించే ఆయుధాన్ని సిద్ధం చేయాలి. ప్రస్తుతం సాంకేతిక లోపంలో కొత్త వ్యాధులకు ఔషధం కనిపెట్టడం పెద్ద సమస్యేమీ కాదు. ప్రస్తుతం కరోనా వైరస్ విషయంలోనూ అదే జరుగుతోంది.

ఇప్పుడంటే వైద్యులు, పరిశోధకులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రజలు ఏ వ్యాధి నుంచైనా బయట పడగల్గుతున్నారు. కానీ వైద్యులు, పరిశోధనలు, సాంకేతికత సరిగ్గా లేని కాలంలో వ్యాధులు ఎలా తగ్గాయి? లక్షల మంది ప్రాణాలు బలిగొన్న వైరసులు, బ్యాక్టిరీయాలను వందల ఏళ్ల క్రితం ప్రజలు ఎలా తరమికొట్టారు? చరిత్రలో భయంకరంగా విరుచుకుపడిన కొన్ని సూక్ష్మ క్రిములు కాల క్రమంలో ఎలా మాయమయ్యాయి. ఇది తెలుసుకోవాలంటే రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం గమ్మడవల్లి గ్రామానికి చెందిన వెళ్లాల్సిందే.

హైదరాబాద్ కు దూరంగా క్వారంటైన్ హోమ్ ను కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. కలరా, ప్లేగు, మసూచి, క్షయ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకకుండా కాపాడుకోగలిగారు. ఇంతకీ ఆ ఒంటరి గదులు ఎక్కడున్నాయి? గతంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తులు తీసుకున్నారు.
గుమ్మడివెల్లి గ్రామంలో సుమారు రెండు వేల మంది జనాభా ఉన్నారు. కొన్ని వందల ఏళ్ల క్రితం హైదరాబాద్ లో అంటువ్యాధులు ప్రబలినప్పుడు నగరానికి దూరంగా ఒంటిరి గృహాలు ఏర్పాటు చేసుకుని నివాసముండేవారు. పది రోజులపాటు ఒంటరి గృహాల్లో హోంక్వారంటైన్ లో ఉండి వ్యాధి తగ్గిన తర్వాత గ్రామ ప్రజల్లో కలిసేవారు. క్వారంటైన్ లో ఉన్నంతకాలం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు.

ఇలా అంటు వ్యాధులను అరికట్టగలిగేవారు. అప్పట్లో ఇలాంటి ఒంటరి గృహాలను చతురస్రాకారంలో నిర్మించేవారు. కొన్ని రెండస్తుల్లో నిర్మించే వారు. ఇలాంటివి ఇక్కడ దాదాపు 30కి పైగా ఉండేవి. కానీ కాలక్రమేణా రజాకార్ల సమయంలో వీటిని కూల్చేయగా మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి.

సాంకేతికత అందుబాటులోకి రావడం, కాలక్రమేణా నగర శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగిపోవడంతో చారిత్రాత్మక ఒంటరి గృహాలు నేలమట్టమయ్యాయి. కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పుడు కేవలం ఈ గ్రామంలో నాలుగు ఒంటిరి పురాతన గృహాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. రోగం ఏదైనా.. వ్యాధి ఎలాంటిదైనా తమను తాము కాపాడుకోవడంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం చేసిన పద్ధతులు మరోసారి అందరం పాటిస్తున్నాం. స్వీయనియంత్రణ ద్వారా ఎలాంటి వ్యాధినైనా అరికట్టవచ్చని మరోసారి రుజువు అయింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *