ట్విట్టర్‌లో రావణుడిపై తమిళుల ప్రశంసలు.. #LordofRavanan హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అయోధ్యలో రామ మందిరానికి ప్రధాని నరేంద్ర మోడీ పునాది రాయి వేశారు.. భారత్ సహా ప్రపంచమంతా ఇప్పుడు అయోధ్య రామ మందిరం గురించే ట్రెండింగ్ టాపిక్ నడుస్తోంది. ఒకవైపు శ్రీరాముడి గుణగణాలను కీర్తిస్తూనే మరికొందరు రావణుడి పరాక్రమాలను కూడా ప్రశంసిస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా రామనామ స్మరణతో పాటు రావణుడి పరాక్రమ, అతని శౌర్యన్ని ప్రశంసిస్తున్నారు. రావణుడు గురించి తమిళనాడులో చాలామంది నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడు ట్విట్టర్ వేదికపై #LandOfRavana, #LandOfRavan, #TamilPrideRavana హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండింగ్ అవుతున్నాయి.సీతను అపహరించిన రామాయణంలోని విలన్ అయిన డెమోన్ కింగ్ (భూతాలకు రాజు) రావణను తమిళనాడులో చాలా మంది ట్విట్టర్ యూజర్లు ప్రశంసించారు. కవి కంబార్ రాసినట్లు నమ్మే కంబా రామాయణం (రామావతారం) అని పిలుస్తుంటారు. ఈ రామాయణం తమిళ వెర్షన్‌లో లంక రావణుని తన శౌర్యం ధైర్యాన్ని ప్రశంసిస్తూ ఈ ట్వీట్లు చేస్తున్నారు. రావణుడిని, అతని పరాక్రమాన్ని, అతని శౌర్యాన్ని తమిళ నెటిజన్లు ట్రెండింగ్ చేస్తున్నారు. రావణుడి పది తలలతో డెమోన్ కింగ్ ఫొటోలతో ట్రెండింగ్ అవుతున్నాయి.కొన్ని ట్వీట్లలో దివంగత సీఎం ఎం. కరుణానిధి పాత వీడియోలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. అందులో ‘రామ్ ఎవరు? అతను ఇంజనీర్ కాదా? రాముడు ఇంజనీర్ అని చెప్పడానికి చారిత్రక ఆధారాలు లేవు. 2007లో, రామ్ సేతును వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీలో కరుణానిధి ఈ వ్యాఖ్యలు చేశారు’.

అయితే ఈ రామసేతును పాల్ స్ట్రెయిట్ మీదుగా రాముడు నిర్మించాడని నమ్ముతున్నారు. రావణుడిపై కనీసం 23,000 మంది ట్విట్టర్ యూజర్లు ప్రశంసలతో ముంచెత్తారు. 33,000 ట్వీట్లు చేశారు. #LandOfRavan పేరుతో ట్విట్టర్‌లో హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌ అవుతోంది.

Related Posts