3లక్షల ఉద్యోగాలిస్తా…సోనూ సూద్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా కష్టకాలంలో వలసకార్మికులు,ప్రవాస భారతీయులను వారి స్వస్థలాలకు చేరుస్తూ,ఆపద అని వినపడితే చాలు ఆదుకుంటూ పెద్ద మనసు చాటుకున్న నటుడు సోనూసూద్ ఇవాళ(జులై-30,2020) తన 47వ బర్త్ డే సందర్భంగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు.తన 47వ పుట్టినరోజును పురస్కరించుకుని మూడు లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తెలిపాడు. ప్రవాసీ రోజ్ గార్ పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు వివరించాడు. ఈ విషయాన్ని తన ఇన్ స్టా అకౌంట్‌లో వెల్లడించాడు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పాడు.


ఈ కార్యక్రమానికి తనతో భాగస్వామ్యం అయిన సంస్థలకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కార్యక్రమానికి తనతో భాగస్వామ్యం అయిన సంస్థలకు సోనూ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా.. సోనుసూద్‌ సేవాతత్పరత కొనసాగుతూనే ఉంది.

రాష్ట్రం ఏదైనా తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ సోషల్ మీడియాలో రియల్ హీరోగా మారిపోయారు సోనూ. కోట్లాదిమంది హృదయాలను తన సేవాతత్పరతతో దోచుకున్న సోనూపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


Related Posts