'గోవా' డబ్బున్న టూరిస్ట్‌లకు మాత్రమే వెల్‌కమ్ చెబుతుందంట!

Once A Green Zone and Ready To Open For 'Rich Tourists', Goa Now Has 52 Coronavirus Cases

ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా పేరొందిన గోవా ఇకపై డబ్బున్న టూరిస్టులకు మాత్రమే వెల్ కమ్ చెప్పనుంది. ఇతర పర్యాటకుల్లో బ్యాక్ ప్యాకర్లు, బడ్జెట్ టూరిస్టులకు అనుమతి ఉండదు.. కేవలం ధనవంతులకే గోవాలో పర్యటించేందుకు అనుమతించనున్నట్టు గోవా పర్యాటక మంత్రి మనోహార్ అజ్గోయెంకర్ ప్రకటించారు. గోవాలో కొత్త కరోనా కేసులు నమోదు కాకపోవడంతో ఇటీవలే గ్రీన్ జోన్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు గోవాలో 50కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గోవాలో రెండు కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం  కరోనా కేసుల సంఖ్య 52కి చేరింది. ఈ కేసుల్లో ఏడుగురు బాధితులకి నయం కాగా, రాష్ట్రంలో 45 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ గోవాలో కరోనాతో ఒక మరణం కూడా నమోదు కాలేదు. 
goa tourism

పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ అయిన గోవాకు బ్యాక్ ప్యాకర్లు, బడ్జెట్ టూరిస్టులకు అనుమతి లేదన్నారు. కానీ, ధనవంతులకు మాత్రమే అనుమతి ఉందని పునరుద్ఘటించారు. 1960 నాటి గోవాను రీక్రియేట్ చేసుకోవడానికి పర్యాటకాన్ని మరోసారి కిక్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. 1960లో గోవా ఎంతో అందంగా ఉండేది. ఇప్పుడు 2020లో గోవాలో కేవలం 8 మిలియన్ పైగా విజిటింగ్ టూరిస్టులతో చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. నిపుణుల సాయంతో గోవా పర్యాటకాన్ని 1960 నాటి పునర్ వైభవం తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు మంత్రి మనోహార్ స్పష్టం చేశారు. 
Goa Now Has 52 Coronavirus Cases

డ్రగ్స్, రోడ్లపై కుకింగ్ చేసే టూరిస్టులు మాకొద్దన్నారు. బీచ్ ల్లో న్యూసెన్స్ చేసేవారు అక్కర్లేదన్నారు. గోవా.. రాష్ట్ర సంస్కృతిని మెచ్చుకునే ధనవంతులైన మంచి టూరిస్టులే తమ పర్యాటకానికి కావాలని ఆకాంక్షించారు. ‘సున్నా నుంచి పర్యాటకాన్ని ప్రారంభించాలి. వాస్తవానికి మనం ఇప్పుడు మైనస్ జీరో స్టేజ్‌లో ఉన్నాం. రాష్ట్రాల మధ్య రవాణా ప్రారంభం అయ్యంతవరకు మనం ఏమి చేయలేం. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడమో లేదా కరోనా వ్యాధి క్యూర్ కావడం జరిగితే తప్ప ఏదైనా చేయగలం. అప్పుడే గోవాలో టూరిజం మళ్లీ గాడిలో పడుతుందని ఆశిస్తున్నా’ అంటూ మంత్రి మనోహార్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

Read: కర్ణాటక కీలక నిర్ణయం...7రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే

మరిన్ని తాజా వార్తలు