కరోనా నుంచి కోలుకున్న నలుగురిలో ఒకరి జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతోంది.. వైద్యుల హెచ్చరిక

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారిలో చాలామందిలో వైరస్ ప్రభావం కనిపిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న నలుగురిలో ఒకరి జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుందని ఒక సర్వే హెచ్చరిస్తోంది. మార్చిలో వైరస్‌తో పోరాడిన బాధితురాలికి తలపై జుట్టు మొత్తం ఊడిపోయి బట్టతల అయింది.సగం కంటే ఎక్కువ జుట్టు రాలిపోయింది.. విగ్ ధరించవలసి వస్తుందని భయపడుతోంది. ఎసెక్స్కు చెందిన Grace Dudley తన దిండుపై జుట్టు కుచ్చులుగా ఊడిపోవడం చూసి షాక్ కు గురైనానని తెలిపింది. ఆన్‌లైన్‌లో ఇతర కరోనా బాధితులు కూడా తీవ్రమైన జుట్టు రాలిపోతుందని వాపోయారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో 1,500 మందిపై ఆన్‌లైన్ సర్వే జరిగింది.

Hair loss

ఫేస్‌బుక్ గ్రూప్ నుంచి వచ్చిన ఫలితాలలో 27 శాతం మంది జుట్టు రాలిపోయిందని గుర్తించారు. నెత్తిమీద జుట్టు రాలడం లేదా కనుబొమ్మలతో పాటు శరీరంలోని ఇతర భాగాలపై ఈ సమస్య ఉండొచ్చునని తెలిపారు. ఈ పరిస్థితిని telogen effluvium (TE)గా గుర్తించారు. కరోనా రోగుల్లో ఎవరైనా తాత్కాలికంగా ఒత్తిడిని ఎదుర్కొంటే సాధారణంగా ఇలాంటి సమస్య తలెత్తుందని వైద్యులు తెలిపారు.నడినెత్తిపై ఉండే ఫోలికెస్ సంఖ్య మారినప్పుడు TE సమస్య వస్తుంది.. సాధారణంగా నెత్తిమీద పైభాగాన్ని ప్రభావితం చేస్తుంది. TE తీవ్రమైన కేసుల్లో ఎక్కువగా కనుబొమ్మలు, శరీరంలోని ఇతర భాగాల్లో జుట్టు రాలిపోవడం కనిపిస్తుంది.. పెద్ద మొత్తంలో బరువు తగ్గడం లేదా తీవ్రమైన జ్వరం తర్వాత రోగులకు TE నిర్ధారణ చేస్తారు.

hair losss

చర్మవ్యాధి నిపుణులు శిల్పి ఖేతర్‌పాల్ ప్రకారం.. కోవిడ్ బాధితుల్లో ఎక్కువగా జుట్టు రాలే సమస్య కనిపిస్తోంది. రెండు మూడు నెలల క్రితం కోవిడ్ -19 నుంచి కోలుకున్న రోగుల్లో జుట్టు రాలడాన్ని గుర్తించామన్నారు. ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదా అధిక జ్వరం, అధిక బరువు తగ్గడం లేదా ఆహారంలో మార్పు వంటి అనేక సాధారణ కారణాలుగా చెప్పవచ్చు.మెనోపాజ్ వంటి హార్మోన్ల మార్పులు కూడా కారణం కావచ్చు. ఇతర వైద్య లేదా పోషక పరిస్థితుల్లోనూ ఇలాంటి సమస్య తలెత్తుతుంది. మీరు TEను ఎదుర్కొంటుంటే, నెత్తి పూర్తిగా మామూలుగా కనిపించాలి. దద్దుర్లు, దురదలు లేదా పొరలు ఉండకూడదు. రోగులకు ఈ లక్షణాలు ఉంటే నిపుణులు చర్మవ్యాధి నిపుణుడిని చూడాలి. వైరస్ బారిన పడిన వారిలో గుర్తించిన వారిలో సైకోసిస్, అలసట, కంటి చూపు కోల్పోవడం వంటి సమస్యలు ఉన్నాయని నిపుణులు సూచించారు.

Related Posts