ఒక్క శుభకార్యం 27మందికి కరోనా తెచ్చిపెట్టింది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విజయనగరంలోని ఓ గ్రామంలో 27 పాజిటివ్ కేసులు నమోదై కలకలం రేపుతుంది. దీంతో గ్రామం మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇటీవల ముత్తాయివలస గ్రామంలో జరిగిన శుభకార్యానికి విజయనగరానికి చెందిన ఓ కుటుంబం వచ్చింది. అందులో ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ గ్రామమంతా కలియదిరిగాడు.

గురువారం ఒక్కరోజే 45కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదుకాగా ముత్తాయవలస మండలంలో 25నమోదయ్యాయి. పాజిటివ్ వచ్చిన వారందరినీ కొవిడ్ హాస్పిటల్ కు తరలించారు. ముత్తాయివలస ఒకే రోజు భారీగా కేసులు నమోదవడంతో కలకలం రేపుతుంది.

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్ని సహాయకచర్యలు తీసుకుంటున్నా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రాకపోతే మహమ్మారిని అడ్డుకోవడం కష్టం. కనీస జాగ్రత్తలు మాస్క్ లు, శానిటైజేషన్ చేసుకోవాలని సూచిస్తున్నప్పటికీ విస్మరిస్తుండటమే వ్యాప్తికి కారణమవుతోంది.

Related Posts