లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

కొత్త సంవత్సరం వేళ రోడ్డు ప్రమాదం – ఒకరి మృతి

Published

on

one person died in road accident at uppal : నూతన సంవత్సరం ప్రారంభమైన శుక్రవారం ఉదయం హైదరాబాద్ ఉప్పల్ వద్ద విషాదం చోటుచేసుకుంది. ఎన్జీఆర్ఐ వద్ద వేగం అదుపు తప్పిన లారీ పలు వాహనాలను ఢీ కొట్టింది. దీంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

హబ్సిగూడ నుంచి ఉప్పల్ వైపు వెళ్తున్న లారీ అతి వేగంగా వెళ్తోంది. లారీ అదుపు తప్పి ఎన్జీఆర్ఐ వద్ద ముందు వెళ్తున్న డీసీఎం ను ఢీ కొట్టింది. ఆ డీసీఎం అదుపుత‌ప్పి ఓ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు విడిచాడు.

డీసీఎం అక్క‌డే ఉన్న హనుమాన్ ఆల‌యం ప్ర‌హ‌రి గోడ‌ను కూడా ఢీకొట్టింది. అదుపు తప్పిన మొదటి లారీని కూడా వెనుక నుంచి వ‌చ్చిన మినీ లారీ ఢీకొట్ట‌డంతో, దాంట్లో ఉన్న న‌లుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న పోలీసులు క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.