లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ట్రాఫిక్ కాలుష్యాన్ని పీల్చుకునే కొత్తరకం మొక్క.. గాలిని ఫిల్టర్ చేసేస్తుంది..

Updated On - 1:11 pm, Tue, 23 February 21

cotoneaster plant

cotoneaster plant could help absorb traffic pollution : పర్యావరణంలోని గాలిలో కాలుష్యాన్ని నియంత్రించగల శక్తి చెట్లకు ఉంది. గాలిలో కార్భన్ డైయాక్సైడ్ ను చెట్లు పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ వాయువును అందిస్తాయి. అలాగే ఆరెంజ్ కోటోనేస్టర్ ( కోటోనేస్టర్ ఫ్రాంచెటి) అని పిలిచే ఓ కొత్త రకం మొక్క కూడా వాహనాల నుంచి వచ్చే పొగ ద్వారా ఏర్పడే గాలిలో కాలుష్యాన్ని వెంటనే పీల్చేచుకుంటోంది. కోటోనేస్టర్ జాతుల్లో ఒకటైన పసుపు వర్ణం కాయలతో కనిపించే ఈ మొక్క గాలిని ఎప్పటికప్పుడూ ఫీల్టర్ చేసేస్తుందంట.. న్యూయార్క్ లోని రాయల్ హార్టికల్చరల్ సొసైటీ, యూకేలో యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్ కు చెందిన పరిశోధక బృందం తమ అధ్యయనంలో గుర్తించింది.

నైరుతి చైనాలో లభ్యమయ్యే సాధారణమైన హెడ్జ్ ప్లాంట్.. కారు నుండి వెలువడే కాలుష్య కారక వ్యర్థాలను పీల్చుకుని గాలిని శుభ్రంగా ఉంచడంలో సాయపడుతుందని కనుగొన్నారు. ఈ మొక్కను ఫ్రాంచెట్ లేదా ఆరెంజ్ కోటోనేస్టర్ ( కోటోనేస్టర్ ఫ్రాంచెటి )గా పిలుస్తారు. వాయు కాలుష్య కారకాలను ఫిల్టర్ చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంది. పట్టణాల్లో నాటిన ఏ మొక్కలు కాలుష్య నివారణకు సాయపడతాయో తెలుసుకోవడమే లక్ష్యంగా 10ఏళ్లుగా మొక్కలపై ఈ పరిశోధన కొనసాగుతోంది. తాజా అధ్యయన ఫలితాలు పరిశోధకుల్లో మరిన్ని అంచనాలను పెంచింది.

ప్రపంచవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే అనేక జాతుల చెట్లపొదలను పరీక్షించడంలో ఈ బృందం తీవ్రంగా కృషి చేసింది. వాయు కాలుష్యం నుంచి రక్షించడంలో కొన్ని అత్యంత ప్రభావవంతమైన మొక్కలను కనిపెట్టే ప్రయత్నంలో ఆరెంజ్ కోటోనేస్టర్ మొక్కను కనుగొన్నారు. హెడ్జెస్ ప్లాంట్.. దట్టంగా పందిరిలా పెరిగే ఈ మొక్క ఆకులు కాలుష్య కారకాలను శుద్ధి చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయని అంటున్నారు. కోటోనేస్టర్ మొక్కను పరీక్షించిన పరిశోధక బృందం పేర్కొంది. గాల్లో పేరుకుపోయిన కాలుష్య కారకాలను ఫీల్టర్ చేయడంలో ఈ మొక్క సాయపడుతుందని వివరించారు. గాలిని శుభ్రపరచడంలో 20శాతం ఎక్కువ ప్రభావవంతంగా ఉందని గుర్తించారు.

అయితే తక్కువ ట్రాఫిక్ ఉన్న వీధుల్లోని ఇతర హెడ్జ్ జాతుల మొక్కల మధ్య ప్రత్యేకమైన తేడాను గమనించలేదని పరిశోధకులు తెలిపారు. కాలుష్యానికి ప్రభావితమయ్యే ప్రాంతాల్లో కారకాలను తగ్గించడానికి ఈ మొక్క సాయపడుతుంది. ఈ మొక్కను అనేక సాగుల కోసం లేదా సౌందర్య విలువ కోసం విదేశాలకు తీసుకువెళ్లారు. అడవిలో పెరిగే ఈ మొక్క.. సాధారణంగా 3 మీటర్ల ఎత్తుకు పెరుగుతుంది. చిన్నపాటి ఓవల్ ఆకులు మెరిసే ఆకుపచ్చ రంగుతో కనిపిస్తుది. టాప్ వైట్-ఫెల్టెడ్ అండర్ సైడ్. జూన్‌ నెలలో గులాబీ లేదా తెలుపు రేకులతో ఎరుపు-నారింజ బెర్రీలుగా పెరుగుతుంది. వీటిని సహజంగా గుర్తుపట్టడం చాలా కష్టమంటున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *