సెల్ ఫోన్ కోసం యువతి సూసైడ్..ఆమె చితి మంటలపై పడి లవర్ ఆత్మహత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఇలాంటి ఘటన జరుగుతుందా అనిపించేలా..ఓ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో సెల్ ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆమె చితి మంటలపై పడి ప్రియుడు సూసైడ్ కు పాల్పడ్డాడు.తనకు సెల్ ఫోన్ కొనివ్వాలని ఉలందూరు పేటలో నివాసం ఉంటున్న నిత్య శ్రీ తండ్రిని అడిగింది. తన ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదని, తర్వాత కొనిస్తానని చెప్పాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన..నిత్య శ్రీ.. ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దహన క్రియలకు ఏర్పాట్లు చేశారు. చితి పేర్చి నిప్పంటించగా..ఒక్కసారిగా ఓ యువకుడు చితి మంటల్లో దూకాడు. అతను కాలిపోయాడు.

ఆత్మహత్యలు చేసుకునేవారిలో పురుషులే ఎక్కువ : NCRB


మొబైల్ వ్యవహారానికి, ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటో తెలియడం లేదు. ఇతని పేరు రాముగా తెలుస్తోంది. నిత్య శ్రీ, రాము మధ్య ప్రేమ ఉందని సమాచారం. లవర్ తో ఛాటింగ్ చేస్తోందని భావించిన తండ్రి, సెల్ ఫోన్ దాచి పెట్టాడని..అందుకే యువతి ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది. ప్రియురాలు చనిపోయిన విషయం తెలుసుకున్న ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

Related Posts