లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

COVID-19 చికిత్స కోసం ఏపీ ఆస్పత్రుల్లో ఆన్ లైన్ బెడ్స్

Published

on

ఏపీలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. రోజు రోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సూచనలను అనుసరించి, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రత్యేకమైన పోర్టల్‌ను ప్రారంభించింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు COVID-19 చికిత్స కోసం ఆసుపత్రులలో లభించే పడకల ప్రత్యక్ష స్థితిని చూడవచ్చు.రాష్ట్రంలో మొత్తం 4211 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. వీటిలో 1697 బెడ్స్ వినియోగంలో ఉండగా, 2514 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఏపీలో మొత్తం 17,236 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. అందులో 7025 బెడ్స్ వాడుకలో ఉండగా 10,211 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 17210 జనరల్ బెడ్స్ ఉన్నాయి. వీటిలో 5607 బెడ్స్ వాడుకలో ఉండగా 11,603 అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 1620 వెంటిలేటర్స్ ఉన్నాయి. అందులో 448 వెంటిలేటర్స్ వినియోగంలో ఉండగా, 1172 అందుబాటులో ఉన్నాయి.

జిల్లాల వారిగా చూస్తే అనంతపురం జిల్లాలో మొత్తం 319 ఐసీయూ బెడ్స్ ఉంటే అందులో 319 వాడుకలో ఉండగా 222 అందుబాటులో ఉన్నాయి. మొత్తం 1260 ఆక్సిజన్ బెడ్స్ ఉంటే వీటిలో 461 వాడుకలో ఉండగా 799 అందుబాటులో ఉన్నాయి. మొత్తం 1258 జనరల్ బెడ్స్ ఉండగా ఇందులో 414 వినియోగంలో ఉండగా 844 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 57 వెంటిలేటర్స్ ఉంటే 41 వాడుకలో ఉండగా 16 అందుబాటులో ఉన్నాయి.చిత్తూరు జిల్లాలో మొత్తం 660 ఐసీయూ బెడ్స్ ఉంటే అందులో 122 వాడుకలో ఉండగా 538 అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 2135 ఆక్సిజన్ బెడ్స్ ఉంటే వీటిలో 507 బెడ్స్ వినియోగిస్తుండగా 1628 అందుబాటులో ఉన్నాయి. మొత్తం 790 జనరల్ బెడ్స్ ఉండగా 267 బెడ్స్ వినియోగిస్తుండగా 523 అందుబాటులో ఉన్నాయి. మొత్తం 57 వెంటిలేటర్స్ కు గానూ 41 వాడుతుండగా 16 అందుబాటులో ఉన్నాయి.

కడప జిల్లాలో మొత్తం 104 ఐసీయూ బెడ్స్ ఉంటే వీటిలో 41 వాడుకలో ఉండగా, 63 అందుబాటులో ఉన్నాయి.జిల్లాలో 420 ఆక్సిజన్ బెడ్స్ ఉంటే వాటిలో 183 వాడుకలో ఉన్నాయి. మిగిలిన 237 అందుబాటులో ఉన్నాయి. మొత్తం 675 జనరల్ బెడ్స్ కి గానూ 592 వాడుకలో ఉండగా, 83 అందుబాటులో ఉన్నాయి. మొత్తం వెంటిలేటర్స్ 61 కి గానూ 9 వినియోగంలో ఉండగా 52 అందుబాటులో ఉన్నాయి.తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 465 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. వీటిలో 270 బెడ్స్ వాడుకలో ఉండగా 195 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 1577 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి.
అందులో 1167 వినియోగిస్తుండగా 410 అందుబాటులో ఉన్నాయి. మొత్తం 1460 జనరల్ బెడ్స్ కు గానూ 267 వాడుకలో ఉన్నాయి. 1193 అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 137 వెంటిలేటర్స్ కు గానూ 77 వాడుకలో ఉన్నాయి. 60 అందుబాటులో ఉన్నాయి.

గుంటూరు జిల్లాలో మొత్తం 305 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. 216 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 89 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 1202 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. వీటిలో 805 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 397 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. 1569 జనరల్ బెడ్స్ ఉన్నాయి. అందులో 588 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 981 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 250 వెంటిలేటర్స్ ఉన్నాయి. 64 వెంటిలేటర్స్ వాడుకలో ఉన్నాయి. 186 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి.పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 205 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. అందులో 140 బెడ్స్ వాడుకలో ఉండగా, 65 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 1593 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. వీటిలో 880 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 713 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 1049 జనరల్ బెడ్స్ ఉన్నాయి. అందులో 455 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 594 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 56 వెంటిలేటర్స్ ఉన్నాయి. వీటిలో 41 వెంటిలేటర్స్ వాడుకలో ఉన్నాయి. 15 అందుబాటులో ఉన్నాయి.

కృష్ణా జిల్లాలో మొత్తం 389 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. అందులో 200 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 189 అందుబాటులో ఉన్నాయి. మొత్తం 1089 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. అందులో 410 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 679 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 1326 జనరల్ బెడ్స్ ఉన్నాయి. వీటిలో 453 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 873 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 170 వెంటిలేటర్స్ ఉన్నాయి. వీటిలో 53 వెంటిలేటర్స్ వాడుకలో ఉన్నాయి. 117 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి.కర్నూలు జిల్లాలో మొత్తం 302 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. అందులో 181 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 121 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 1705 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. అందులో 65 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 1640 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 1133 జనరల్ బెడ్స్ ఉన్నాయి. వీటిలో 621 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 512 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 135 వెంటిలేటర్స్ ఉన్నాయి. అందులో 40 వెంటిలేటర్స్ వాడుకలో ఉన్నాయి. 95 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి.

నెల్లూరు జిల్లాలో మొత్తం 280 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. అందులో 50 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 230 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 560 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. అందులో 149 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 411 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 869 జనరల్ బెడ్స్ ఉన్నాయి. వీటిలో 440 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 429 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 171 వెంటిలేటర్స్ ఉన్నాయి. అందులో 5 వెంటిలేటర్స్ వాడుకలో ఉన్నాయి. 166 అందుబాటులో ఉన్నాయి.శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 121 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. అందులో 77 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 44 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 1354 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. అందులో 946 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 408 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 3525 జనరల్ బెడ్స్ ఉన్నాయి. అందులో 130 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 3395 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 79 వెంటిలేటర్స్ ఉన్నాయి. అందులో 56 వెంటిలేటర్స్ వాడుకలో ఉన్నాయి. 23 వెంటిలేటర్స అందుబాటులో ఉన్నాయి.

విశాఖపట్నం జిల్లాలో మొత్తం 798 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. అందులో 225 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 573 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 3367 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. వీటిలో 807 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 2560 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 2243 జనరల్ బెడ్స్ ఉన్నాయి. అందులో 915 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 1328 అందుబాటులో ఉన్నాయి. మొత్తం 230 వెంటిలేటర్స్ ఉన్నాయి. వీటిలో 23 వెంటిలేటర్స్ వాడుకలో ఉన్నాయి. 207 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి.విజయనగరం జిల్లాలో మొత్తం 155 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. అందులో 38 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 117 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 339 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. అందులో 51 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 288 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 891 జనరల్ బెడ్స్ ఉన్నాయి. అందులో 50 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 841 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 23 వెంటిలేటర్స్ ఉన్నాయి. అందులో 8 వెంటిలేటర్స్ వాడుకలో ఉన్నాయి. 15 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి.

ప్రకాశం జిల్లాలో మొత్తం 108 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. అందులో 40 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 68 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 635 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. అందులో 594 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 41 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 422 జనరల్ బెడ్స్ ఉన్నాయి. అందులో 415 బెడ్స్ వాడుకలో ఉన్నాయి. 7 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 103 వెంటిలేటర్స్ ఉన్నాయి. అందులో 5 వెంటిలేటర్స్ వాడుకలో ఉన్నాయి. 98 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి.Tables


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *