తమిళనాడులో జూలై 13 నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఆన్‌లైన్ క్లాసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి 14న విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యాయి. విద్యా సంస్థలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలీదు. ఇప్పటికే విద్యా సంవత్సరం బాగా ఆలస్యమైపోయింది. ఇప్పట్లో స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరిచే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు తెరవకపోయినా టైమ్ కి సిలబస్ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది.

Without access to technology, Chandigarh govt school students ...

5 ప్రైవేట్ చానల్స్ లో క్లాసులు:
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం జూలై 13 నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పాఠశాల విద్యాశాఖ మంత్రి సెంగొట్టియం బుధవారం(జూలై 8,2020) తెలిపారు. ఇందుకోసం ఐదు ప్రైవేట్ చానెల్స్ సాయం తీసుకుంటామన్నారు. ఒక్కో చానల్ లో ఒక్కో సబ్జెక్ట్ ని టెలికాస్ట్ చేస్తామన్నారు. అంతేకాదు ఇన్ టైమ్ లోనే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు కూడా పంపిణీ చేస్తామన్నారు. ఈ రోడ్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్ లకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ క్లాసుల గురించి మాట్లాడారు.

మహారాష్ట్రలో డీడీ సహ్యాద్రిలో పాఠాలు:
మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఆన్ లైన్ క్లాసుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం డీడీ సహ్యాద్రి చానెల్ లో 1 నుంచి 8వ తగరతి విద్యార్థులగాను ప్రత్యేక ఎడ్యుకేషనల్ ప్రొగ్రామ్ రూపకల్పన చేసింది. జూలై 20 నుంచి సహ్యాద్రి చానెల్ లో టెలివైజ్డ్ లెక్చర్స్ ప్రసారం చేయనుంది. టిలిమిలి(TiliMili) పేరుతో దీన్ని ప్రసారం చేయనుంది. ఇది 30 నిమిషాల నిడివితో ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ ఉదయం 7.30 గంటలకు ప్రసారం చేస్తారు.

corona-cases-in-india

తమిళనాడులో కరోనా కల్లోలం:
కాగా, తమిళనాడు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులో 3,756 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, చెన్నైలో వరుసగా ఐదో రోజు 2వేలలోపు కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం(జూలై 8,2020) 1,261 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య లక్షా 22వేల 350కి చేరింది. ఒక్క చెన్నైలోనే 72వేల 500 కేసులు నిర్ధారణ అయ్యాయి.

Related Posts