లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

ఆన్ లైన్ న్యూస్ పోర్టల్స్, OTTలు ఇక ప్రభుత్వ నియంత్రణలో

Published

on

Online News Portals, Content Providers Now Under Government Regulation ఆన్ లైన్ న్యూస్ పోర్టల్స్ మరియు నెట్ ఫ్లిక్స్ వంటి కంటెంట్ ప్రొవైడర్స్ ని సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ కిందకు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు డిజిటల్ కంటెంట్ ను నియంత్రించేందుకు ఎలాంటి చట్టం లేదా స్యయంప్రతిపత్తి బాడీ లేదన్న విషయం తెలిసిందే.ప్రింట్ మీడియా వ్యవహారాలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(PCI), వార్తా ఛానళ్లను న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్(NBA)మానిటర్ చేస్తుంటది. ప్రకటనల వ్యవహారాలను అడ్వర్టయిజింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మానిటర్ చేస్తుండగా,సినిమాల విషయాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC)చూసుకుంటోంది.అయితే, స్వయం ప్రతిపత్తి గల OTT ప్లాట్‌ఫామ్‌లను నియంత్రించాలన్న ఓ పిటిషన్‌పై గత నెలలో సుప్రీంకోర్టు కేంద్రం స్పందన కోరిన విషయం తెలిసిందే. కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.OTT ప్లాట్‌ఫామ్‌లలో న్యూస్ పోర్టల్స్ మరియు హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ సేవలు ఉన్నాయి, ఇవి ఇంటర్నెట్ ద్వారా అందుబాటులో ఉంటాయి లేదా ఆపరేటర్ నెట్‌వర్క్‌లో ఉంటాయి. సినిమా మరియు సిరీస్ ల రిలీజ్ విషయంలో సెన్సార్స్ బోర్టు నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్స్ గురించి ఆందోళన చెందకుండా ఓటీటీ స్ట్రీమింగ్ మరియు డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఫిల్మ్ మేకర్లకు ఉపశమనం కలిగిస్తున్న విషయం తెలిసిందే.


25కోట్ల మంది PhonePe యూజర్లు.. 92.5 కోట్ల లావాదేవీలు


అయితే, డిజిటల్ మీడియాను నియంత్రించాల్సిన అవసరం ఉందని, విద్వేషపూరిత ప్రసంగాల నియంత్రణకు సంబంధించి మార్గదర్శకాలను నిర్దేశించే ముందు న్యాయస్థానం మొదట వ్యక్తుల కమిటీని అమికస్‌గా నియమించవచ్చని ఓ ప్రత్యేక కేసులో ఇటీవల సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకి తెలిపింది. మీడియాను నియంత్రించాలనుకుంటే…తొలుత డిజిటల్​ మీడియాతో ప్రారంభించాలని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఎలక్ట్రానిక్​, ప్రింట్​ మీడియా నియంత్రణకు ఇప్పటికే సరిపడా నిబంధనలు ఉన్నాయని సుప్రీం కోర్టులో సెప్టెంబర్ లో దాఖలు చేసిన అఫిడవిట్ ​లో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సివిల్​ సర్వీసు ఉద్యోగాల్లోకి ఓ వర్గం వారినే అధికంగా తీసుకునేందుకు కుట్ర జరిగింది అని సుదర్శన్​ టీవీ ఛానల్… ‘UPSC జీహాద్’ టైటిల్ తో ​ ప్రోమోలు ప్రసారం చేయడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఈమేరకు కేంద్రం తన అభిప్రాయం చెప్పింది.మీడియా స్వేచ్ఛను హరించే ఎలాంటి చర్యలు తమ ప్రభుత్వం తీసుకోదని గతేడాది కేంద్ర సమాచార మరియు ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ వ్యాఖ్యానించారు. అయితే, ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా సినిమాలకి ఉన్నట్లుగానే ఓటీటీ(ఓవర్ ది టాప్ ప్లాట్‌ఫామ్స్)లపై రెగ్యూలేషన్ ఉండాలని అభిప్రాయపడ్డారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *