ఏపీలో కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్…. అనంతలో దొరికిపోయిన కిడ్నాపర్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

operation muskaan going on in AP : ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నిజిల్లాల్లో బుధవారం తెల్లవారుఝూమునుంచి ఆపరేషన్ ముస్కాన్ కొనసాగుతోంది. జిల్లా ఎస్పీలు, లేబర్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు మరియు ఇతర ఎన్జీవో సంస్థల ప్రతినిధులతో కలిసి బాల కార్మికులను వీధి బాలలను రక్షిస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్నతనిఖీల్లోనే నిన్న హైదరాబాద్ లో కిడ్నాపైన డెంటిస్ట్ హుస్సేన్ ను కిడ్నాపర్ల చెరనుంచి పోలీసులు రక్షించారు.

బాల కార్మిక వ్యవస్ధ నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా అన్ని జిల్లాల్లో పోలీసు అధికారులు సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. వీధి, అనాథ, తప్పిపోయిన, పారిపోయి వచ్చిన, భిక్షాటన చేస్తున్న బాలలను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. వీధుల్లోనూ బస్టాండ్,రైల్వేస్టేషన్లు, హోటల్స్, పరిశ్రమలు దుకాణాలు,రద్దీ ప్రాంతాల్లోనూ ఉన్న బాలలను గుర్తించి వారిని సంరక్షణా కేంద్రాలకు తరలిస్తున్నారు.ఆపరేషన్ ముస్కాన్ లో కిడ్నాపర్లు అరెస్ట్… డెంటిస్ట్ సేఫ్
అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఆపరేషన్ ముస్కాన్ లో నలుగురు కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లో నిన్న కిడ్నాపైన దంతవైద్యుడు హుస్సేన్ ను పోలీసులు రక్షించారు. వీధి బాలలను రక్షించే క్రమంలో అనంతపురం జిల్లా పోలీసులు చేస్తున్నతనిఖీల్లో కిడ్నాపర్లు ప్రయాణిస్తున్న వాహనం కూడా తనిఖీ చేసారు.అనంతపురం మీదుగా బెంగుళూరు వెళ్తున్న కిడ్నాపర్ల వాహనం మరూర్ టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీ చేసారు. పోలీసులు వాహనం ఆపటంతో కిడ్నాపర్లలోని నలుగురు వాహనం దిగి పారిపోయారు. వారిలో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రోగి కడుపులో కత్తెర పెట్టి కుట్టేసిన డాక్టర్లు..లబోదిబోమన్న పేషెంట్


హైదరాబాద్ ఎక్సైజ్ కాలనీలో నిన్న సాయంత్రం కిడ్నాప్ కు గురైన దంత వైద్యుడు హుస్సేన్ ను నిన్న సాయంత్రం ఓ ముఠా కిడ్నాప్ చేసింది. హుస్సేన్ ను మొదట ఒక గదిలో బంధించి , చిత్ర హింసలకు గురిచేసినట్లు డాక్టర్ వెల్లడించారు. కాసేపటి తర్వాత కాళ్లు చేతులు తాళ్లతోకట్టేసి ముఖానికి ముసుగువేసి కారులో ఎక్కించారని….తనను ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదని బాధిత డాక్టర్ హుస్సేన్ వాపోయారు. వీధిబాలలను రక్షించే కార్యక్రమంలో కిడ్నాపైన డాక్టర్ కూడా క్షేమంగా దొరకటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.


Related Tags :

Related Posts :