6AI కెమెరాలతో OPPO F17 సిరీస్ వస్తోంది.. మిడ్ రేంజ్ ధరలో ఇదే బెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Oppo F17 Pro, Oppo F17 Launching in India: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తోంది.. అదే.. ఒప్పో F17 సిరీస్.. ఒప్పో F సిరీస్ నుంచి కొత్త రెండు వేరియంట్లను రిలీజ్ చేస్తోంది. ఒప్పో F17, ఒప్పో F17pro రెండు వేరియంట్లు మిడ్ రేంజ్ కేటగిరీలో అందుబాటులోకి వచ్చాయి.

ఈ ఏడాదిలో మార్కెట్లోకి రిలీజ్ అయిన ఒప్పో F15 స్మార్ట్ ఫోన్ కు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత మిడ్ రేంజ్ కేటగిరిలో ఒప్పో ఎఫ్17, ఎఫ్17 ప్రో స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. కొత్త ఒప్పో F17 సిరీస్ రాత్రి 7 గంటలకు వర్చువల్ ఈవెంట్ ద్వారా కంపెనీ లాంచ్ చేస్తోంది.



గతంలో ఎన్నడూ లేనంతగా మొదటిసారి మ్యూజికల్ లాంచ్ ఈవెంట్ ఆన్ లైన్‌లో నిర్వహిస్తోంది. కంపెనీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఒప్పో ఎఫ్17 సిరీస్ లాంచ్ లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనుంది. అంతేకాదు.. ఇతర మీడియా ప్లాట్ ఫాంలపై కూడా యాక్సస్ ఇవ్వనుంది. ఒప్పో ఇండియా వెబ్ సైట్లో కూడా లైవ్ ఈవెంట్ వీక్షించవచ్చు. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లను ఇష్టపడే millennial యూజర్లకు Oppo F17 సిరీస్ ఫెవరేట్ స్మార్ట్ ఫోన్ గా చెప్పొచ్చు..

ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఇవే :
ఒప్పో F17 ప్రో స్మార్ట్ ఫోన్లో మొత్తం 6 కెమెరాలు ఉన్నాయి.. అల్ట్రా స్లీక్ డిజైన్, 6 AI పోర్టట్రయిట్ కెమెరాలతో వస్తోంది. 64MP క్వాడ్ కెమెరా సెటప్ బ్యాక్ సైడ్ వస్తోంది.. ఫ్రంట్ సైడ్ డ్యుయల్ కెమెరాలు ఉన్నాయి. AI బ్యాకడ్ కెమెరా ఫీచర్లతో వస్తోంది.



స్మార్ట్ ఫోన్లో డ్యుయల్ పంచ్ హోల్ డిస్ ప్లేతో పాటు మీడియా టెక్ హెలియో P95 ప్రాసెసర్ పవర్ కూడా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే.. 4,000mAh బ్యాటరీ సామర్థ్యంతో 30W VOOC ఫ్లాష్ ఛార్జ్ 4.0తో పాటు ColorOS ఆధారిత ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతోంది.

Oppo F17 వేరియంట్ స్మార్ట్ ఫోన్లో 6.44 అంగుళాల Full HD+ సూపర్ AMOLED డిస్‌ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ కూడా ఉంది.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ తో రన్ అవుతుంది. ఫ్రంట్ కెమెరాల్లో 16MP క్వాడ్ కెమెరాలు ఉన్నాయి.. సింగిల్ 16MP ఫ్రంట్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. F17 ప్రో మాదిరిగానే F17 వేరియంట్ లోనూ 4,000mAh బ్యాటరీ ఉండొచ్చు.. అలాగే 30W VOOC ఫ్లాష్ ఛార్జ్ 4.0 సపోర్టుతో రానుంది.



ఒప్పో ఎఫ్17 రెండు వేరియంట్ల ధర కూడా 25 వేల వరకు ఉండనుంది.. Oppo F17 మోడల్ ధర మార్కెట్లో రూ.20 వేలు, ఒప్పో F17 Pro ధర రూ. 25 వేల లోపు ఉండొచ్చు.

READ  రియల్‌మీ బడ్స్.. కేవలం రూ.1999కే.. అదిరిపోయే ఫీచర్లు

Related Posts