ఒప్పో కొత్త కాన్సెప్ట్.. స్ర్కీన్ చుట్టేసే స్మార్ట్ ఫోన్ రాబోతుంది!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

OPPO smartphone rollable display : స్మార్ట్ ఫోన్లలో కొత్త ట్రెండ్.. ఫోల్డబుల్‌ ఫోన్స్‌‌కు పోటీగా రోలబుల్‌ ఫోన్స్‌ రాబోతున్నాయి. ఒప్పో నుంచి చుట్టే స్క్రీన్లతో స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి నవంబర్ 17న జరిగే వార్షిక సదస్సులో ఒక కీలక ప్రకటన చేయనుంది.చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ Weiboలో ముడుచుకునే డిస్‌ప్లే స్ర్కీన్‌తో కొత్త ఫోన్ ఎలా ఉంటుందో ప్రదర్శించింది. బిగ్ స్ర్కీన్.. చిన్న స్ర్కీన్.. ఇన్ ఫైనేట్ స్ర్కీన్ ఉంటుందా? అనేది చూడాలి.

భవిష్యత్తులో ఒప్పో మొబైల్ ఫోన్ ఫ్రీగా ముడుచుకునేలా చేయొచ్చునని వెయిబో పోస్టులో తెలిపింది. ఒప్పో రోలబుల్ స్ర్కీన్.. వంపు తిరిగిన డిస్ ప్లేతో రానుంది.డిస్‌ప్లేను మడతబెట్టి చిన్న సైజులోకి మార్చుకునే వీలుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను స్మార్ట్ ఫోన్ మేకర్ వెల్లడించలేదు. ఈ ఏడాదిలో TCL కంపెనీ కూడా రాబోయే ప్రొటోటైప్ స్మార్ట్ ఫోన్ కాన్సెప్ట్ గురించి రివీల్ చేసింది. అదే మాదిరిగా ఒప్పో కాన్సెప్ట్ ఫోన్ కూడా ఉంటుందని అంటున్నారు.


శాంసంగ్ గెలాక్సీ S21 Ultra ఫోన్ ఫీచర్లు లీక్.. బెస్ట్ టెలిఫొటో కెమెరాలు


రెండో జనరేషన్ Augmented Reality (AR) గ్లాసెస్‌లను లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఒప్పో AR గ్లాసులు డెప్త్ సెన్సార్లతో రాబోతోంది. ఆప్టికల్ వేవ్ గైడ్ టెక్నాలజీ, సపోర్ట్ వాయిస్ ఇంట్రాక్షన్, 3D సరౌండ్ సౌండ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఈ ఏడాదిలో ఒప్పో ప్రకటించిన హైబ్రిడ్ జూమ్ పెరిస్కోప్ లెన్స్ కూడా ప్రదర్శనకు ఉంచే అవకాశం ఉంది. హైబ్రిడ్ లెన్స్ వేరిబుల్ జూమ్ 3.3x and 5.4x, 11x హైబ్రిడ్ జూమ్ సామర్థ్యం కలిగి ఉంది.

Related Tags :

Related Posts :