లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

Farm Bills – 2020 : విపక్షాలు ఎందుకు వద్దంటున్నాయి ? పూర్తి వివరాలు

Published

on

Agriculture Minister Narendra Singh Tomar : పార్లమెంట్‌ వేదికగా.. కేంద్రం తీసుకొస్తున్న మూడు వ్యవసాయరంగ బిల్లులపై మాటల యుద్ధం నడుస్తోంది. విపక్షాల నిరసనలు, అనేక రాష్ట్రాల్లో రైతుల ఆందోళనల మధ్య మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో గట్టెక్కించింది. ఇక రాజ్యసభలో వీటి ఆమోదమూ లాంఛనప్రాయంగా జరగనుంది. విపక్షాలు వద్దనడానికి కారణాలు ఏంటి..? అసలు ఈ బిల్లుల్లో ఏముంది..? బిల్లులపై కేంద్ర ప్రభుత్వ వాదనేంటి..? విపక్షాల అభ్యంతరాలేంటి..? ఎవరి మాటేంటి..?కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ రంగ బిల్లులో మొదటిది.. వ్యవసాయ మార్కెట్‌ బిల్లు. దీనికే రైతు ఉత్పత్తుల వ్యాపారం, ప్రోత్సాహం – వెసులుబాటు బిల్లు అని పేరు పెట్టింది కేంద్రం. ఈ బిల్లుతో రైతులు తాము పండించిన పంటను.. రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్‌ కేంద్రాల్లోనే అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు.

దేశంలో ఎక్కడైనా రైతులు తమ పంటను అమ్ముకోవచ్చు. ఇందుకు రైతుల నుంచి ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయరు. ఇక మార్కెటింగ్‌, రవాణా ఖర్చులను తగ్గించి రైతు ఉత్పత్తులు మంచి ధర పొందేట్లు చేయడం ఈ బిల్లు ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. అధిక దిగుబడి ఉంటే ఆ సరుకు లేని ప్రాంతానికి వెళ్లి తమ ఉత్పత్తిని రైతులు అమ్ముకోవచ్చు.ఎలక్ట్రానిక్‌ ట్రేడింగ్‌కు ఈ బిల్లుతో కేంద్రం వెసులుబాటు కల్పిస్తోంది.విపక్షాలు, రాష్ట్రాల అభ్యంతరాలు : –
ఇక ఈ బిల్లుపై విపక్షాలు, రాష్ట్రాల అభ్యంతరాలను చూస్తే.. రాష్ట్రాల పరిధిలో నడిచే వ్యవసాయ మార్కెట్ల అవసరం ఉండదు కనుక రైతులు రాకపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా రాష్ట్రాలు మార్కెట్‌ ఫీజు వసూలు చేయలేవు.. దీంతో రాష్ట్రాలు భారీగా ఆదాయాన్ని నష్టపోతాయి.

మండీల నుంచి ఉత్పత్తులన్నీ బయట విక్రయానికి వెళ్లిపోతాయి కాబట్టి.. మండీలను నమ్ముకుని ఉన్న వేలాది మంది కమీషన్‌ ఏజెంట్లు రోడ్డున పడతారని విపక్షాలు తమ వాదన వినిపిస్తున్నాయి. ఇక కనీస మద్దతు ధర క్రమేణా రద్దవుతుందనే అనుమానాలను రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీఎంసీల్లో ఉండే ఈ-నామ్‌ అనే ఎలక్ట్రానిక్‌ విధానం కూడా రద్దవుతుందరనే వాదన వినిపిస్తున్నాయి విపక్షాలు.ఇక కేంద్రం తెస్తున్న రెండో బిల్లు.. కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ బిల్లు. ఈ బిల్లుతో రైతులను, బడా వ్యాపారులను దగ్గర చేస్తామంటోంది కేంద్రం. వ్యవసాయరంగ వ్యాపార సంస్థలు, బడా రిటైలర్లు, టోకు వ్యాపారులు, ఎగుమతిదారులతో ధరల విషయమై పంట వేయడానికి ముందే ఓ ఒప్పందానికి రావడానికి వీలు కల్పించనుంది. దేశంలో 86 శాతం మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే కాబట్టి.. ఐదు హెక్టార్లలోపు పొలం ఉన్న రైతులు ఈ కాంట్రాక్టు కుదుర్చుకోవచ్చు. దీంతో మార్కెట్‌ ఎప్పుడెలా ఉంటుందోననే భయం రైతులకు ఉండదు. రైతులు ఉత్పత్తులు పెద్ద వ్యాపారులకు వెళ్లిపోతాయి.

మార్కెటింగ్‌ ఖర్చు తగ్గి, ఆదాయం పెరుగుతుంది. దళారీ వ్యవస్థ లేకుండా రైతులు తమకు నచ్చిన ధరకు కాంట్రాక్టు కుదుర్చుకోవచ్చని కేంద్రం చెబుతోంది. ఒకవేళ వివాదాలు నెలకొంటే దానికి పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేసి.. నిర్దిష్ట కాలావధిలోగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటారు.విపక్షాల అభ్యంతరాలు : – 
ఇక ఈ బిల్లులోనూ విపక్షాలు అభ్యంతరాలు తెలుపుతున్నాయి. ఈ బిల్లుతో రైతులు తమకు కావాల్సిన రేటు పొందలేరని.. రిటైలర్లదే పైచేయి అవుతుందన్ని విపక్షాల వాదన. బడా వ్యాపారులు, టోకు వ్యాపారులు చెప్పిందే నడుస్తుందని.. రైతు వాదించి.. లాభ పడలేడంటున్నాయి రాష్ట్రాలు. చిన్న, సన్నకారు రైతులతో ఒప్పందాలకు బడా సంస్థలు, టోకు వ్యాపారులు సుముఖత చూపరని.. సాంకేతికత వినియోగంలో కార్పొరేట్లదే పైచేయి అవుతుందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

మూడోది అత్యవసర సరుకుల బిల్లు. ఈ బిల్లుతో పప్పులు, తృణ ధాన్యాలు, నూనెగింజలు, ఉల్లి, బంగాళదుంపలు మొదలైన వాటిని అత్యవసర సరుకుల జాబితా నుంచి తొలగించనుంది కేంద్రం. యుద్ధం లాంటి అసాధారణ పరిస్థితుల్లో తప్ప.. ఈ సరుకుల నిల్వపై ఉన్నపరిమితులు ఎత్తివేత ఉంటుంది.వ్యవసాయ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుదంటోంది కేంద్రం. ఇక వ్యాపారంలో ప్రైవేటు పెట్టుబడిదారుల మితిమీరిన జోక్యానికి కళ్లెం వేసేలా ఈ బిల్లును తీసుకొచ్చింది. కోల్డ్‌ స్టోరేజీలు, ఆధునిక ఆహార సరఫరా వ్యవస్థల ఏర్పాటు వంటి మౌలిక సౌకర్యాల్లో పెట్టుబడులకు వీలు కల్పించనుంది.

రైతులు, వినియోగదారునికి ఉపయోగంగా ధరల స్థిరీకరణ చేపట్టనుంది. ఈ బిల్లుతో మార్కెటింగ్‌లో పోటీతత్వం పెంచే అవకాశం ఉందంటోంది కేంద్రం. ఉత్పత్తులు కూడా ఎక్కువగా వృధా కాకుండా చూడవచ్చనేది కేంద్రం వాదన.విపక్షాల వాదన : – 
అయితే అసాధారణ పరిస్థితుల్లో అత్యవసర ధరలు పెరిగిపోవచ్చనేది విపక్షాల వాదన. ఈ బిల్లుతో ఉత్పత్తులను పెద్ద కంపెనీలు భారీగా నిల్వ చేసుకునేందుకు వీలుంటుందని.. ఆ కంపెనీలు రైతులను తమ టర్మ్స్‌కు అనుగుణంగా శాసిస్తాయి. దీంతో రైతులు తగిన ధర పొందలేరనేది రాష్ట్రాల వాదన.అయితే ఈ మధ్యే కేంద్రం ప్రభుత్వం ఉల్లి ఎగుమతిని నిషేధించింది. అలాంటి పరిస్థితుల్లో ఈ నిబంధనలు వర్తిస్తాయా, వర్తిస్తే ఏ మేరకు.. అన్న ప్రశ్నలనూ విపక్షాలు లేవనెత్తుతున్నాయి. మొత్తం మీద.. కేంద్రం తెచ్చిన మూడు బిల్లులతో రైతు నష్టపోతాడన్నది విపక్షాల మాట.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *