no Patispet in the National third front

వాటికి మేం దూరం : మహాకూటమిలో చేరం 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భువనేశ్వర్ : ఇప్పుడు దేశంలో థర్డ్ ఫ్రంట్ గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అని ఒకరంటే..ఫెడరల్ ఫ్రంట్ అని మరొకరు ఈ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు పార్టీ నేతలు..సీఎంలతో భేటీ అయి చర్చలు కూడా జరిపారు. ఈ క్రమంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతు..బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తాము దూరంగా వుంటున్నామనీ..ఇకపై కూడా అలాగే కొనసాగుతామని…మహాకూటమిలో తాము చేరటం లేదని నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. 

ఒడిశాలో మొత్తం 21 లోక్ సభ స్థానాలు ఉండగా..2014 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. బీజేడీ మిగిలిన 20 స్థానాలను గెలుచుకోగా… కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేకపోకపోవటం  దీంతో బీజేడీనే రాష్ట్రంలో చక్రం తిప్పుతోంది. ఈ క్రమంలో థర్డ్ ఫ్రంట్ లో చేరేది లేదని సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. 

 

Related Posts