ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్ష టైమ్ టేబుల్ లో స్వల్ప మార్పులు చేసిన ఉస్మానియా యూనివర్శిటీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Osmaniya University engineering semister exams new time table : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ లో కొన్ని స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం సవరించిన షెడ్యూల్ టైమ్ టేబుల్ ను యూనివర్శిటీ రిలీజ్ చేసింది. మెుదట విడుదల చేసిన పరీక్ష టైమ్ టేబుల్ ప్రకారం రోజుకో ఎగ్జామ్ నిర్వహించేలా రూపొందించారు. అయితే తాజాగా రెండు ఎగ్జామ్స్ మధ్యలో కనీసం ఒక్క రోజు గ్యాప్ ఉండేలా టైమ్ టేబుల్ లో మార్పులు చేశారు.
అలాగే విద్యార్థుల నెక్స్ట్ సెమిస్టర్ పరీక్షకు మధ్యలో 45 రోజుల గ్యాప్ ఉండేలా చూస్తామని, ఇలా చేయటం ద్వారా విద్యార్ధుల ప్రిపరేషన్ కు తగిన సమయం దొరుకుతుందని యూనివర్శిటీ ఇంచార్జ్ వైఎస్ ఛాన్సలర్ అరవింద్ కుమార్ తెలిపారు. ఈ నెల 23 నుంచి జరగనున్న ఓయూ ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షలతో పాటు సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి అని తెలిపారు. విద్యార్ధులు పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ లో చూడవచ్చు.సవరించిన తాజా టైమ్ టేబుల్ :
> 6వ సెమిస్టర్ (మెయిన్ పరీక్ష) : నవంబర్ 23, 2020 నుంచి డిసెంబర్ 14, 2020 వరకు.
> మొదటి సెమిస్టర్(సప్లిమెంటరీ) : డిసెంబర్ 14,2020 నుంచి జనవరి 02, 2021 వరకు
> రెండవ సెమిస్టర్(మెయిన్/బ్యాక్‌లాగ్) : నవంబర్ 24, 2020 నుంచి డిసెంబర్ 15, 2021 వరకు> మూడవ సెమిస్టర్(సప్లిమెంటరీ) : నవంబర్ 23,2020 నుంచి డిసెంబర్ 17,2020 వరకు
> నాలుగో సెమిస్టర్(మెయిన్) : డిసెంబర్ 5, 2020 నుంచి డిసెంబర్ 28, 2020 వరకు జరుగుతాయి.

Related Tags :

Related Posts :