లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

మేఘాలయలో 1500 కిలోల పేలుడు సామాగ్రి స్వాధీనం

Published

on

1,500kg of explosives, 6,000 detonators seized in Meghalaya : ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయా లో పోలీసులు భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాలకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తూర్పు జయంతియా జిల్లాపరిధిలోని లాడ్రింబై పోలీసు అవుట్‌పోస్ట్ ప్రాంతంలోని కాంగోంగ్ చెక్ పోస్ట్ వద్ద సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఒక వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో 10 పెట్టెల్లోతరలిస్తున్న 250 కేజీల పేలుడు పదార్ధాలు లభించాయి.వీటిలో 2 వేల జిలిటిన్‌ స్టిక్స్‌, వెయ్యి లైవ్‌ డిటోనేటర్లు, 8 ఫ్యూజ్‌ రోల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలోని ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారిని ప్రశ్నించారు. వారి ఇచ్చిన సమాచారంతో మరో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు.ఆరుగురు ఇచ్చిన సమాచారంతో మరో పేలుడు సామగ్రి డంప్‌ గురించి తెలిసింది.ఖ్లీహ్రియాట్ ప్రాంతంలో తనిఖీ చేయగా 51 పెట్టెల్లో ఉన్న 1,275 కేజీల పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. ఇందులో 10,200 జిలిటిన్‌ స్టిక్స్‌, 5 వేలు డిటోనేటర్లు, 8 ఫ్యూజ్‌ రోల్స్‌ ఉన్నాయి. దీంతో మొత్తంగా 1,525 కేజీల పేలుడు పదార్థాలు, 6 వేల డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నామని పోలీస్‌ అధికారులు తెలిపారు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *