లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

బహిరంగ ప్రదేశంలో మాస్క్ ధరించని వారిపై జరిమానా

Published

on

Over 3,600 people penalised in 3 days for not wearing mask : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గినప్పటికీ మరి కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య నిలకడగా నమోదవుతూ ఉండటంతో  ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.

మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో ప్రతీ ఒక్కరు మాస్క్‌ ధరించాలని అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ పెడచెవిన పెట్టేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. మాస్క్‌లు ధరించని వారికి విధిస్తున్న జరిమానాల విషయంలో నిబంధనలు వివిధ రాష్ట్రాల్లో మారాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ పెరగడంతో మాస్క్‌ ధరించని వారికి విధించే జరిమానా రూ. 500 నుంచి రూ.2000కు పెంచారు.


బహిరంగ ప్రదేశాలల్లో మాస్క్ ధరించని 3,600 మందిపై నోయిడా గ్రేటర్ నోయిడా పోలీసులు 3 రోజుల్లో చలానాలు జారీ చేసినట్లు తెలిపారు. బహగిరంగ ప్రదేశాల్లో కోవిడ్-19 నింబంధనలకువిరుధ్దంగా మాస్క్ లేకుండా తిరిగుతున్న వ్యక్తులకు చలానాలు జారీ చేసి జరిమానా వసూలు చేయాలని పోలీసు కమీషనర్ అలోక్ సింగ్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం నాడు నోయిడా ,గ్రేటర్ నోయిడా ఏరియాలో మాస్క్ లు ధరించని 1200 మందికి పోలీసులు చాలానాలు జారీ చేయగా….శనివారం నాడు 1,312 మందిపై చలానాలు జారీ చేసారు వారి వద్దనుంచి రూ. 1.31 లక్షలు జరిమానాగా వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.


No Mask : 5 నెలల్లో రూ. 78 కోట్ల ఆదాయం


ఆదివారం నాడు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుండా తిరుగుతున్న మరో 1089 మందికి చలానాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ప్రజలు తప్పని సరిగా మాస్క్ ధరించాలని లేనివారిపై జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.


గుజరాత్ లో
కరోనాను కట్టడి చేసేందుకు జరిమానాలు విధించడంలో గుజరాత్‌ అధికారులు ఇతర రాష్ట్రాల కంటే కాస్త ముందున్నారు. జూన్‌ 15 నుంచి ఇప్పటì వరకు రాష్ట్రంలో మాస్క్‌లు ధరించనివారికి అధికారులు చలాన్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు 26 లక్షల మంది ప్రజల నుంచి రూ.78 కోట్లు జరిమానా వసూలు చేశారు.


అత్యధికంగా అహ్మదాబాద్‌లో ప్రతి నిమిషానికి అత్యధికంగా 120 మందికి జరిమానా విధించారు. మాస్క్‌ ధరించకుండా దొరికితే గుజరాత్‌లో తప్పనిసరిగా కరోనా పరీక్ష చేస్తున్నారు. ఒకవేళ రిపోర్ట్‌ పాజిటివ్‌గా వస్తే రూ. వెయ్యి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేగాక వారిని వెంటనే ఆసుపత్రికి చికిత్స కోసం పంపిస్తారు.


దేశంలో 45వేల కొత్త కేసులు
దేశంలో 24 గంటల్లో 45,209 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90.95 లక్షలకు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 501 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,33,227కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఆదివారానికి 85,21,617కు చేరుకుంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,40,962గా ఉంది.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *