Home » గార్డును కొట్టి, సీసీటీవీల మీద స్ప్రేకొట్టి ATMని పేల్చేసి… డబ్బును ఎత్తుకెళ్లారు. హాలీవుడ్ రేంజ్ దోపిడికి ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న కుర్రాడు… ఈ గ్యాంగ్‌కు లీడర్!
Published
6 months agoon
By
sreehariహాలీవుడ్ రేంజ్లో దోపిడీకి పాల్పడ్డారు. లక్షలాది రూపాయలను ఏటీఎంలో నుంచి కొల్లగొట్టారు. ఏటీఎం గార్డును చావగొట్టారు.. సీసీటీవీల మీద స్ప్రే కొట్టారు.. ఏటీఎంను పేల్చేసి అందులో నగదును ఎత్తుకెళ్లారు. ఈ దొంగల ముఠాకు సూత్రదారి.. గ్యాంగ్ లీడర్.. ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న కుర్రాడేనంట.. అది తెలిసి పోలీసులే షాక్ అయ్యారు.
ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో జరిగింది. పేలుడు పదార్థాలతో పలు ఎటిఎంలను కొల్లగొట్టిన ఆరుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటీఎం నుంచి రూ. 23 లక్షల నగదును నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఏటీఎంలో చోరీ ఎలా.. ఇంటర్నెట్లో నేర్చుకుని..
పోలీసులు కథనం ప్రకారం.. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న దేవేంద్ర పటేల్ (28) ఈ ముఠాకు సూత్రధారిగా ఉన్నాడు. మిగతా ఐదుగురు సభ్యుల్లో నితేష్ పటేల్, రాకేశ్ పటేల్, పరమ్, లోధి, జగేశ్వర్ పటేల్, జైరామ్ పటేల్‌గా గుర్తించారు. గత ఏడాది జూన్ నుంచి ఈ ముఠా డిటోనేటర్ ఉపయోగించి చాలా ఎటిఎం దొంగతనాలకు పాల్పడ్డారు. ఏటీఎంల్లో చోరీ చేసే పద్ధతిని పటేల్ ఇంటర్నెట్లో నేర్చుకున్నారని దామోలోని పోలీసు సూపరింటెండెంట్ హేమంత్ చౌహాన్ తెలిపారు.
నిందితుల్లో ఎక్కువ మంది విద్యావంతులే ఉన్నారు.. సాంకేతిక పరిజ్ఞానం గురించి బాగా తెలిసినవారే ఉన్నారు. ముఖాలకు మాస్క్ ధరించి రెండు బైక్‌లపై వచ్చారు. ఇద్దరు వ్యక్తులు ఎటిఎం గార్డును కొట్టారు. కెమెరాలపై బ్లాక్ పెయింట్ స్ర్పే చేశారు. ఇద్దరు డిటోనేటర్‌ను బైక్ బ్యాటరీతో కనెక్ట్ చేయగా ఇద్దరు నగదును ఏటీఎంల్లో నుంచి దొంగలించారు. కేవలం 14 నిమిషాల్లోనే లక్షల నగదును ఎత్తుకెళ్లారు’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
సిసిటివి ఫుటేజ్‌తో ముఠాను ట్రాక్ చేసిన పోలీసులు:
ఈ దొంగల ముఠా పన్నాలోని ఏటిఎంను దోచుకోవడానికి ప్రయత్నించింది. పక్కనే అమర్చిన సిసిటివి కెమెరాను వారు గమనించలేదు. సిసిటివి ఫుటేజీని పరిశీలించినప్పుడు, పోలీసులకు ముఖ్యమైన ఆధారాలు లభించాయి.
ఆరుగురు నిందితులకు సాయం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడంతో అంతా వెలుగులోకి వచ్చింది. రూ .25.57 లక్షల నగదు, రూ .3 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు, ఒక డిటోనేటర్, రెండు దేశీయ పిస్టల్స్, ఎనిమిది లైవ్ కార్ట్రిడ్జ్లను నిందితుల వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.