6 నెలల్లో ఆక్స్ ఫర్డ్ టీకా!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

oxford : ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుందని బ్రిటన్ ఆశాభావంతో ఉంది. ఆస్ట్రాజెనెకాతో కలిసి టీకా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరి నాటికి ఆరోగ్య నియంత్రణ అధికారుల నుంచి ఆమోదాలు లభిస్తాయని, వెంటనే టీకాను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.ఆరు నెలలు కావొచ్చు..అంతకంటే..తక్కువ సమయం పట్టవచ్చు అని ప్రభుత్వాధికారి చెప్పినట్లు ది టైమ్స్ పత్రిక ఓ కథనం వెల్లడించింది. ఆమోదం పొందిన తర్వాత..టీకాను 65 అంతకంటే..ఎక్కువ వయస్సున్న వారికి ముందుగా అందిస్తామని అంటున్నారు.ప్రపంచాన్ని కరోనా వణికిస్తోందన్న సంగతి తెలిసిందే. దీంతో వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పలు దేశాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. బ్రిటన్ లో మాత్రం వ్యాక్సిన్ చివరి దశలో ఉన్నాయి. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో కలిసి రూపొందించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటోంది.భారతదేశంలో ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ఆశాజనకంగానే ఉన్నాయని తెలుస్తోంది. గతంలో వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇవ్వగా..వారిలో కొంత అస్వస్థత లక్షణాలు కనిపించాయి. దీంతో భారత్ లో ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేశారు. డ్రగ్స్ కంట్రోలర్స్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు వచ్చాక..తిరిగి ప్రయోగాలను ప్రారంభించారు. పుణెలోని కింగ్ ఎడ్వర్డ్‌ మెమోరియల్‌ ఆసుపత్రి, ససాన్ జనరల్ హాస్పిటల్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియాతో కలిసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఈ ప్రయోగాలను చేపడుతోంది.

Related Tags :

Related Posts :