కరోనా భయంతో ఆక్సిజన్ సిలిండర్లు కొంటున్నారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తోంది. కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారిన పడకుండా బతికేయవచ్చని ప్రభుత్వం ఎంత చెపుతున్నా ప్రజలు మాత్రం భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఎందుకంటే ఎవరికి ఎక్కడ నుంచి వ్యాధి అంటుకుంటుందో తెలియని పరిస్ధితి నెలకొంది. కోవిడ్ వ్యాధి లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్ వస్తున్న సందర్భాలు చూస్తున్నాం. దీంతో ప్రజలు చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

కోవిడ్ బారిన పడిన రోగులకు ఆక్సిజన్ అవసరం అవుతుందని…రానున్నరోజుల్లో ఆక్సిజన్ సిలిండర్లు కూడా దొరకవనే భయంతో కొందరు ముందుగానే ఆక్సిజన్ సిలిండర్లు కొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. మరి కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్ లు ముందుగానే రిజర్వ్ చేసి పెట్టుకుంటున్నారు. కొన్ని గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు, రెస్పిరేటర్లు, పల్స్‌ ఆక్సీమీటర్లు ముందస్తుగా కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు.

నిజానికి కరోనా బాధితుల్లో 90% మందికిపైగా ఆక్సిజన్‌ అవసరం లేకుండానే ప్రాథమిక చికిత్సతో కోలుకుంటున్నారని ప్రభుత్వం, వైద్యులు రోజూ చెప్తూనే ఉన్నారు. శ్వాస సంబంధ వ్యాధులు, వృద్ధాప్యం, వైరల్‌ లోడ్‌ అధికంగా ఉండటం.. ఇలాంటి సమస్యలున్నవారికే ఆక్సిజన్‌ అవసరమని నివేదికలు, సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో 700 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతుంటే.. వారిలో ఆరుగురే వెంటిలేటర్‌పై ఉన్నా రు. అంటే ఒక్కశాతం కన్నా తక్కువ. అయినా కొందరు అతిగా భయపడిపోయి హంగామా సృష్టిస్తున్నారు. అనవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్లకు డిమాండ్‌ పెంచుతున్నారని వైద్యులు అంటున్నారు.

అపోహలు వద్దు…ఇంటివైద్యంతోనే కోలుకోవచ్చు
కరోనా ప్రాథమిక లక్షణాలు ఉన్నవారికి ఇంటివద్దే ఉంచి చికిత్స అందించాలని ఐసీఎంఆర్‌ గతంలోనే స్పష్టంచేసింది. వైద్యసిబ్బంది నేరుగా ఇంటికి వెళ్లడం లేదా టెలిమెడిసిన్‌ ద్వారా వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇలాంటివారిలో 90 శాతానికిపైగా త్వరగా కోలుకుంటున్నారు. మిగతావారిలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నవారికి, వైద్యుల పర్యవేక్షణలోనే కృత్రిమ శ్వాస అందించాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా సోకినా ప్రతివారికీ కృత్రిమ శ్వాస అవసరం ఉండదని…. పైగా మన వద్ద ఆక్సిజన్‌ కొరతలేదు. అపోహలు పెట్టుకోవద్దనినిపుణులు చెపుతున్నారు. ఇది సరికాదని వారు సూచిస్తున్నారు.

Related Tags :

Related Posts :