లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

Sussex pacer : బంతి స్వింగ్ కావాలని శానిటైజ్ రాశాడు..తర్వాత

Published

on

Fast bowler Mitchell Claydon : క్రికెట్ లో బాల్ స్వింగ్ కావాలని ఇంగ్లండ్ కౌంటీ ప్లేయర్ మిచ్ క్లేడన్ (Australian pacer) శానిటైజ్ రాశాడు. ఈ విషయం అతను ఆడుతున్న జట్టుకు తెలిసింది. దీంతో అతనిపై నిషేధం విధించారు. ఇతను సస్సెక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత నెలలో జరిగిన ఓ మ్యాచ్ లో ఇతను పాల్గొన్నాడు.




బంతికి శానిటైజర్ రాసి బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు దక్కించుకున్నాడు. ఈ విషయం క్రికెట్ బోర్డు స్పందించింది. క్లేడన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ…సస్సెక్స్ జట్టు అతడిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఇంగ్లండ్:, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విచారణ జరిపిస్తోంది.

తప్పిపోయిన జల్లికట్టు ఎద్దులు..వెతకేందుకు వెళ్లిన యువకుల్ని తరిమిన చిరుతల గుంపు





బంతి స్వింగ్ కావడానికి క్రికేట్ ప్లేయర్స్ ఉమ్మి రాస్తుంటారనే సంగతి తెలిసిందే. బంతికి మెరుపు కూడా వస్తుందని ఇలా చేస్తుంటారు కానీ…కరోనా నేపథ్యంలో క్రికెట్ మండలి (ICC) పలు నిబంధనలు ప్రవేశపెట్టింది. బంతిపై ఎలాంటి ఉమ్మి రాయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఉమ్మి లేదా చెమటతో బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుందని క్రికేటర్లు అంటుంటారు. ఇటీవలే వెస్టిండీస్‌తో మాంచెస్ట‌ర్‌లో జ‌రుగుతున్న రెండ‌వ టెస్టులో ఇంగ్లండ్ క్రికెట‌ర్ డామ్ సిబ్లే పొర‌పాటునా బంతికి ఉమ్మి అంటించాడు. ఆట నాలుగ‌వ రోజున ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో.. సిబ్లే అనుకోకుండా బంతికి ఉమ్మి రాశారు. బంతికి ఉమ్మి రాసిన‌ట్లు ఇంగ్లండ్ టీమ్‌ అంపైర్ల‌కు చెప్ప‌డంతో.. వారు ఆ బంతిని శానిటైజ్ చేశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *