Padi Padi Leche Manasu Closing Collections - 10TV

క్లోజింగ్ కలెక్షన్స్ – నిర్మాత నిండా మునిగాడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పడి పడిలేచే మనసు రూ.22.5 కోట్లమేర బిజినెస్ చేస్తే, అందులో 35శాతం మాత్రమే రికవరీ చెయ్యగలిగింది.

యంగ్ హీరో శర్వానంద్, సాయి పల్లవి జంటగా, హను రాఘవపూడి డైరెక్షన్‌లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన పడిపడి లేచే మనసు డిసెంబర్ 21న రిలీజ్ అయ్యింది. ప్రేమకథల్ని చక్కగా డీల్ చేస్తాడనీ, సినిమాని ఒక టెంపోతో రన్ చేస్తూ, సగంలో ఏంచెయ్యాలో తెలియక చేతులెత్తేస్తాడని హను గురించి అందరూ చెప్తుంటారు. అయినా అవేమీ పట్టించుకోకుండా జనాలు థియేటర్స్‌కెళ్తే, ఈసారీ అదే పని చేసాడు. అందుకే శర్వానంద్, సాయి పల్లవిల నటన, కెమిస్ట్రీ బాగున్నా, పడిపడి లేచే మనసు యావరేజ్ టాక్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫస్ట్‌లో యూత్‌కి బాగానే కనెక్ట్ అవుతున్నట్టే అనిపించినా, హను దెబ్బకి ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ అయిపోయారు.

రూ.22.5 కోట్లమేర బిజినెస్ చేస్తే, అందులో 35శాతం మాత్రమే రికవరీ చెయ్యగలిగింది. కొత్త ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరిని నిలువునా, నిండా ముంచేసాడు దర్శకుడు హను. ఇక పడి పడి ప్రయాస పడిన  ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయిపోయింది. పడి పడిలేచే మనసు క్లోజింగ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజాం : రూ.2.61 కోట్లు
సీడెడ్ : రూ.0.84 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ.0.82 కోట్లు
ఈస్ట్ : రూ.0.42 కోట్లు
వెస్ట్ : రూ.0.32 కోట్లు
కృష్ణ : రూ.0.49 కోట్లు

గుంటూరు : రూ.0.62 కోట్లు
నెల్లూరు : రూ.0.31కోట్లు 
ఏపీ, తెలంగాణా : రూ.6.43 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : రూ.0.48 కోట్లు
ఓవర్సీస్ : రూ.1.06 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ : రూ.7.97 కోట్లు (డిస్ట్రిబ్యూటర్ షేర్) 
 

Related Posts