లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఉలిక్కిపడిన శివమొగ్గ : 8 మంది మృతి, ప్రధాని సంతాపం

Published

on

Shivamogga : కర్నాటకలో శివమొగ్గలో ఓ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. జిల్లాలోని హోనసోడు గ్రామం సమీపంలో ఉన్న క్వారీలో గురువారం రాత్రి 10 గంటల 20 నిమిషాలకు ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి 8మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్వారీలో ఉపయోగించే పేలుడు పదార్థాలు తరలిస్తుండగా ఈ పేలుళ్లు సంభవించినట్టు సమాచారం. పేలుడు ధాటికి క్వారీలో ఉన్న వాహనాలు తునాతునకలయ్యాయి. మృతుల శరీరాలు గుర్తు పట్టలేనంగా ఛిద్రమయ్యాయి.

భారీ స్థాయిలో పేలుడు సంభవించడంతో క్వారీ నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంపంగా భావించిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శివమొగ్గ నుంచి చిక్‌మగ్‌ళూరు వరకు ప్రకంపనల తీవ్రత కనిపించింది. దీంతో శివమొగ్గ నుంచి చిక్‌మగ్‌ళూరు వరకు రోడ్లపైనే జనం జాగారం చేశారు. మరోవైపు సహాయ చర్యలు మందకోడిగా సాగుతున్నాయి. మైనింగ్‌ ఏరియా కావడంతో … చీకట్లో పేలుడు పదార్థాలు ఎక్కడున్నాయో తెలియడం లేదు.

శబ్ధం తీవ్రతకు శివమొగ్గ మొత్తం చిగురుటాకులా వణికిపోయింది. తమ జీవితం మొత్తంలో అంత పెద్ద శబ్ధం ఎప్పుడూ వినలేదని.. అసం జరిగిందో అర్థం కావడానికి చాలా సమయం పట్టిందని శివమొగ్గ వాసులు అంటున్నారు.

మరోవైపు…మరోవైపు..పేలుడు ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని పీఎంఓ ట్వీట్‌ చేసింది.