లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

14 ఏళ్ల బాలికను పెళ్లాడిన 50 ఏళ్ల ఎంపీ

Published

on

pakistan MP

Pak MP Maulana Salahuddin Ayubi Marries 14-Year-Old Girl From Balochistan, Probe Ordered : పాకిస్తాన్ కు చెందిన 50 ఏళ్ల పార్లమెంట్ సభ్యుడు 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న వార్త దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది.

జమియత్ ఉలేమా ఎ ఇస్లాం నేత, బలూచిస్తాన్ ఎంపీ మౌలానా సలాహుద్దీన్ అయూబీ అనే 50 ఏళ్ల ఎంపీ …14 ఏళ్ళ బాలికను వివాహం చేసుకున్నాడు. బలూచిస్తాన్ లోని జుగూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆ బాలిక 2006 అక్టోబరు 28వ తేదీన జన్మించినట్లు రికార్డుల్లో నమోదైంది.

దీని ప్రకారం మైనర్‌ బాలికను ఎం‍పీ వివాహం చేసుకున్నట్లు చిత్రాల్ లో మహిళలకోసం పని చేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన చిత్రాల్ పోలీసులు బాలిక పెళ్లి ఉదంతంపై దర్యాప్తు చేశారు. అయితే తాము ఈ పెళ్లి చేయలేదని, తమకు పెళ్లితో ఎలాంటి సంబంధం లేదని బాలిక తల్లిదండ్రులు అఫిడవిట్ సమర్పించడం గమనార్హం.

పాకిస్తాన్‌ చట్టాల ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి వివాహం చేసుకుంటే అది చెల్లదు. అంతేకాకుండా తల్లి తండ్రులు ఉద్దేశ్య పూర్వకంగా ఈ పని చేసినా వారుకూడా బాధ్యులవుతారు. వారిపై కూడా కఠిన శిక్షలు అమలు చేస్తారు. తన కుమార్తెకు 16సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వివాహం చేయనని బాలిక తండ్రి పోలీసులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా… ఎంపీ కి, బాలికతో నిక్కా కొద్ది మంది కుటుంబ సభ్యులు,మత పెద్దల మధ్య రహస్యంగా జరిగిందని. సరైన వివాహ కార్యక్రమం ఇంకా జరగలేదని తెలుస్తోంది.