పుల్వామా ఉగ్రదాడితో దాయాది పాకిస్థాన్ పై భారత్ సర్జికల్ ఎటాక్ తో ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎల్ఓసీ సరిహద్దులోని జైషే మహ్మద్ ఉగ్రవాద ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం (ఐఎఎఫ్) విరుచుకపడింది.
వార్ వన్ సైడ్ అనుకుంటూ ఉన్నాం.. భారత యుద్ధ విమానాలు మిరాజ్ 2000 పాకిస్తాన్ దేశంలోకి వెళ్లి.. బాలాకోట్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి వచ్చాయి. ఇదంతా వన్ సైడ్ అంటోంది పాక్ ఆర్మీ. భారత్ యుద్ధ విమానాలు పాక్ గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే.. మేం కూడా అలర్ట్ అయ్యాం అంటున్నారు పాక్ ఎయిర్ ఫోర్స్
అధికారులు. పాక్ యుద్ధవిమానాలు గాల్లోకి లేచి.. భారత్ జెట్ ఫైటర్లను వెంటాడినట్లు చెబుతున్నారు. మాకు దొరకకుండా వెళ్లిపోయారని వెళుతూ వెళుతూ బాలాకోట్ లో బాంబులు వేశారని మాత్రం చెబుతోంది.
Also Read : మిరాజ్ యుద్ధ విమానాల దాడి.. లైవ్ వీడియో చూడండి
పుల్వామా ఉగ్రదాడితో దాయాది పాకిస్థాన్ పై భారత్ సర్జికల్ ఎటాక్ తో ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎల్ఓసీ సరిహద్దులోని జైషే మహ్మద్ ఉగ్రవాద ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం (ఐఎఎఫ్) విరుచుకపడింది. మిరాజ్ యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. మిరాజ్ యుద్ధ విమానాల దాటికి పాక్ గజగజ వణికిపోయింది. సర్జికల్ ఎటాక్ లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి భారత వైమానిక దళాలు ప్రవేశించాయి. భారత్ మెరుపు దాడిని ఎదుర్కొనేందుకు పాక్ విఫలయత్నం చేసింది.
Also Read : సర్జికల్ ఎటాక్: పాక్ చేస్తానంది మనం చేసి చూపెట్టాం
పాకిస్థాన్ F 16 యుద్ధ విమానాలతో భారత్ పై ప్రతి దాడికి యత్నించింది. ఈ క్రమంలో ఇండియా మిరాజ్ యుద్ధ విమానాల స్థాయిని అడ్డుకోలేక పాక్ ఎఫ్ 16 తోకముడిచింది. పాకిస్థాన్ ప్రతిదాడిని భారత్ ఎయిర్ ఫోర్స్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇండియా మిరాజ్ యుద్ధ విమానాల సామర్థ్యం, తెగువను చూసి పాకిస్థాన్ వెనక్కి తగ్గినట్టు నిఘా వర్గాల సమాచారం. వెస్ట్రరన్ ఎయిర్ కమాండ్ (ఐఎఎఫ్) ఆధ్వర్యంలో మెరుపు దాడి జరిగినట్టు తెలుస్తోంది.
భారత్ ను దీటుగా ఎదుర్కొలేని పాకిస్థాన్.. తాము ప్రతిదాడి చేయడంతో భారత వైమానిక దళాలు వెనక్కి తగ్గినట్టు చెప్పుకోవడం గమనార్హం. మంగళవారం (ఫిబ్రవరి 26, 2019) తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మెరుపు దాడులు జరిపింది. 12 ఫైటర్ మిరాజ్-2000 యుద్ద విమానాలతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ దాడులు చేసింది. పాక్ ఉగ్ర సంస్థలకు చెందిన కంట్రోల్ రూమ్లను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం.
భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ నిఘా డ్రోన్ ను భారత భద్రత బలగాలు ధ్వంసం చేశాయి. దీంతో పాక్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇండియా ఐఎఫ్ సర్జికల్ ఎటాక్ పై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి అత్యవసరం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇండియా ప్రతీకార దాడిపై పాక్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పబ్లిక్ ను తప్పుదోవ పట్టించొద్దని సూచించారు. యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ పాక్ అప్రమత్తంగానే ఉందని ఖురేషి తెలిపారు.
Also Read : ప్రపంచానికి ముందే చెప్పాం.. పాక్ ప్రధాని అత్యవసర సమావేశం