గిల్గిట్​​-బాల్టిస్థాన్​ కు రాష్ట్ర హోదా ఇస్తాం…పాకిస్తాన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కశ్మీర్​ అంశంలో ఎన్నిసార్లు భంగపాటు ఎదురైనా.. వక్రబుద్ధిని మార్చుకోని పాకిస్తాన్ ఇప్పుడు… పాక్​​ ఆక్రమిత కశ్మీర్​(పీఓకే)లోని గిల్గిట్​-బాల్టిస్థాన్​ ప్రాంతానికి పూర్థిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే ప్రధాని ఇమ్రాన్ ​ఖాన్… ​గిల్గిట్​​-బాల్టిస్థాన్​ ప్రాంతంలో పర్యటించి దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని గిల్గిట్​​-బాల్టిస్థాన్​ వ్యవహారాల శాఖ మంత్రి అలీ అమిన్​ గండాపుర్​ తెలిపారు.


అన్ని రకాల రాజ్యాంగ హక్కులతో పూర్తిస్థాయి రాష్ట్రహోదాపై అధికారిక ప్రకటన చేయనున్నారని అమిన్​ గండాపుర్​ తెలిపారు. జాతీయ అసెంబ్లీ, సెనేట్​ సహా అన్ని రాజ్యాంగ సంస్థల్లో గిల్గిట్​​-బాల్టిస్థాన్​కు తగిన ప్రాతినిధ్యం ఇస్తామన్నారు. చైనా, పాకిస్థాన్​ ఎకనామిక్ కారిడార్ ​(సీపెక్​) కింద మోక్​ పాండస్​ ప్రత్యేక ఆర్థిక జోన్​ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.


పాక్​ కు ఎలాంటి హక్కులు లేవన్న భారత్
కాగా, గిల్గిట్​-బాల్టిస్థాన్​తో పాటు మొత్తం జమ్ముకశ్మీర్​, లడఖ్ ​ కేంద్ర పాలిత ప్రాంతాలు తమ దేశంలో అంతర్భాగమేనని ఇప్పటికే పాక్​కు స్పష్టం చేసింది భారత్​. అక్రమంగా, బలవంతంగా ఆక్రమించుకున్న భూభాగంపై పాక్​ కు ఎలాంటి హక్కులు లేవని తేల్చిచెప్పింది. ఆక్రమించుకున్న అన్ని భూభాగాలను ఖాళీ చేయాలని గత మే నెలలోనే సూచించింది. ఇప్పటికే.. సీపెక్​ కారిడార్​ పీఓకే నుంచి వెళ్తుండడంపై భారత్ అభ్యంతరం ​వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Related Posts