Home » తప్పుడు డెత్ సర్టిఫికేట్‌తో రూ.22కోట్లు ఇన్సూరెన్స్ వసూలు చేసిన మహిళ
Published
1 month agoon
By
subhnPak woman: తప్పుడు డెత్ సర్టిఫికేట్లతో 1.5మిలియన్ అమెరికన్ డాలర్ల (రూ.22కోట్లు పాకిస్తాన్ కరెన్సీ) ఇన్సూరెన్స్ వసూలు చేసింది ఓ మహిళ. ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) అధికారుల ప్రకారం.. సీమ ఖార్బే 2008, 2009 సంవత్సరాలలో అమెరికాకు వెళ్లింది. అక్కడే ఆమె పేరు మీద రెండు లైఫ్ ఇన్సూరెన్స్ లు తీసుకుంది.
పాకిస్తాన్ లోని కొందరు స్థానిక గవర్నమెంట్ అఫీషియల్స్ కు లంచం ఇచ్చింది. అందులో డాక్టర్లు కూడా ఉన్నారు. వారి చలవతో డెత్ సర్టిఫికేట్ పుట్టించిన మహిళ.. ఆమె శవాన్ని పాతిపెట్టినట్లు కూడా చెప్పింది.
ఆ తర్వాత మహిళ ఇద్దరు పిల్లలు రెండు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల కోసం క్లెయిమ్ చేశారు. దాదాపు 23 కోట్ల పాకిస్తాన్ రూపాయలను కావాలని క్లెయిమ్ చేసింది.
చనిపోయిందని డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఖార్బే విదేశాలకు కరాచీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి 10సార్లు వెళ్లి వచ్చింది. ఈ మోసాన్ని ఏ అధికారులు గుర్తించలేకపోయారు. ‘ఓ ఐదు దేశాలు తిరిగి వచ్చిన తర్వాత కూడా తెలుసుకోలేకపోయారు’ అని అధికారులు చెప్పారు.
ఆమెపై ప్రస్తుతం హ్యూమన్ ట్రాఫికింగ్ అధికారులు క్రిమినల్ కేస్ బుక్ చేశారు. ఆమెతో పాటు కొడుకు, కూతురు, డాక్టర్‌పైన కూడా కేసులు ఫైల్ అయ్యాయి. ‘అమెరికా అధికారులు మహిళ గురించి మమ్మల్ని అలర్ట్ చేయడంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం’ అని అధికారి చెప్పారు.