భర్తకు నాలుగో భార్య కావాలంటోన్న ముగ్గురు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Pakistan: ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి నాలుగో పెళ్లికి కూడా రెడీ అయిపోయాడు. ఇవన్నీ ఒకరికి తెలియకుండా మరొకరితో చేసుకున్న సీక్రెట్ మ్యారేజెస్ కాదు. చట్టబద్ధంగా పరస్పర అంగీకారంతో చేసుకున్నవే. ఇప్పుడు నాలుగో పెళ్లి కూడా అలా చేసుకోవాలనే ట్రై చేస్తున్నాడు అద్నాన్.

పాకిస్థాన్‌లో సైల్‌కోట్‌లో నివసిస్తున్న అద్నాన్‌కు ముగ్గురు భార్యలు. నలుగురు పిల్లలు. 16 ఏళ్ల వయస్సులోనే తొలి వివాహం చేసుకున్న ఈ వ్యక్తి.. నాలుగేళ్ల తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. గతేడాది ముచ్ఛటగా మూడో పెళ్లి కూడా చేసేసుకున్నాడు. అంతటితో ఆగకుండా నాలుగో పెళ్లికి కూడా రెడీ అయ్యాడు.ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన భార్యలు.. వారితో పాటుగా మరో భార్యను తీసుకొచ్చేందుకు రెడీ అయి వధువును వెతికే బాధ్యతలను వారే తీసుకున్నారు. వారి ముగ్గురు పేర్లు సంబాల్, షబానా, శహీదా కావడంతో నాలుగో భార్య పేరు కూడా ఎస్ తోనే రావాలని ట్రై చేస్తున్నారట.

ఈ పెళ్లిల్లపై అద్నాన్ స్పందిస్తూ… ‘నా కుటుంబ పోషణకు నెలకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకూ ఖర్చవుతుంది. పెళ్లి చేసుకున్న ప్రతిసారి నా ఆర్థిక పరిస్థితి మెరుగవుతూ వస్తుంది. ’ అని తెలిపాడు.

పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్ విరాళమివ్వనున్న కెనడా


ఒకే ఇంట్లో ఉండే ఈ ముగ్గురు భార్యలు గొడవలు పడటం వంటివి ఉండనే ఉండవట. అద్నాన్ తోనూ ఎటువంటి కంప్లైంట్ చేయరట. కాకపోతే వంతులు వేసుకుని భర్తతో గడపాలనుకుంటున్న వీరికి సమస్య ఏంటంటే.. తమ భర్త పూర్తి అటెన్షన్ చూపించడం లేదని నిరుత్సాహపడుతున్నామని అంటున్నారు.

అద్నాన్ ఒక భార్య దగ్గర ఉన్నప్పుడు మిగిలిన ఇద్దరు పనిచేయాలనేది వారి ఒప్పందం. అంటే భర్త వచ్చినప్పుడల్లా హాలీడే లో ఉన్నట్లు అన్నమాట.

Related Tags :

Related Posts :