pakistan-announces-november-15-as-poll-date-for-gilgit-baltistan-assembly-elections

గిల్గిత్- బాల్టిస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలకు పాక్ నోటిఫికేషన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లోని గిల్గిత్- బాల్టిస్థాన్​ అసెంబ్లీకి నవంబర్ 15న ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ఇదివరకు వాయిదా పడ్డ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరిస్తూ పాక్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, పాక్​​ ఆక్రమిత కశ్మీర్​(పీఓకే)లోని గిల్గిట్​-బాల్టిస్థాన్​ ప్రాంతానికి పూర్థిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ పరిణామాలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

వాస్తవానికి, జూన్- 24న గిల్గిత్- బాల్టిస్థాన్ అసెంబ్లీ గడువు ముగిసింది. ఆగస్టు 24నే ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం…. గిల్గిత్- బాల్టిస్థాన్​ అసెంబ్లీకి నవంబర్ 15న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన పాకిస్తాన్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.


మరోవైపు, పాక్ తీరుపై లడఖ్ ఎంపీ జమ్యాంగ్​ సెరింగ్​ నంగ్యాల్ తీవ్రంగా మండిపడ్డారు. గిల్గిత్- బాల్టిస్థాన్​ భారత్​లో అంతర్భాగం అని తేల్చిచెప్పారు. అక్కడి ప్రజలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. పాకిస్థాన్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్థాన్​ లో క్రూరమైన మారణహోమం ప్రారంభించేందుకు ఇమ్రాన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు.



పాక్​ కు ఎలాంటి హక్కులు లేవన్న భారత్​

కాగా, గిల్గిట్​-బాల్టిస్థాన్​తో పాటు మొత్తం జమ్ముకశ్మీర్​, లడఖ్ ​ కేంద్ర పాలిత ప్రాంతాలు తమ దేశంలో అంతర్భాగమేనని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇవన్నీ భారత్​లో అంతర్భాగమని పాకిస్థాన్​కు పలుమార్లు వెల్లడించింది. చట్టవిరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించుకున్న ప్రాంతాలపై పాకిస్థాన్​కు ఎలాంటి హక్కు లేదని,ఆక్రమించుకున్న అన్ని భూభాగాలను ఖాళీ చేయాలని గత మే నెలలోనే పాక్ కు సూచించింది.

ఇప్పటికే.. సీపెక్​ కారిడార్​ పీఓకే నుంచి వెళ్తుండడంపై భారత్ అభ్యంతరం ​వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు పాకిస్థాన్ విడుదల చేసిన రాజకీయ చిత్రపటంపైనా భారత్ వ్యతిరేకత వ్యక్తం చేసింది. గుజరాత్, జమ్ముకశ్మీర్, లడఖ్ ​ ప్రాంతాలకు చెందిన భూభాగాలను పాకిస్థాన్ తనదిగా చూపించడాన్ని భారత్ తప్పుబట్టింది.



Related Posts