లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

పాకిస్తాన్ లో రేప్ చేస్తే మగతనం పోగొడతారు

Published

on

Pakistan Cabinet approves in-principle chemical castration, hanging of rapists : పాకిస్తాన్ లో పెరిగిపోతున్న అత్యాచార ఘటనలు అరికట్టటానికి అక్కడి ప్రభుత్వం రేపిస్టులకు కఠినమైన శిక్షలు అమలు చేసేందుకు రెండు కొత్త ఆర్డినెన్స్ లను తీసుకు వస్తోంది. రేప్ చేసిన వ్యక్తికి ఇక జీవితంలో మగతనం లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టబోతోంది. అందకు అవసరమైన చట్టాలు చేయనున్నారు.

రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్(రసాయనాల ద్వారా పుంసత్వాన్ని దెబ్బతీయడం) చేయడం, రేప్‌ల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం, అవసరం అయితే ఉరిశిక్ష విధించటం వంటి వాటిని అమలుచేయటం కోసం పాక్‌ ప్రభుత్వం రెండు కొత్త ఆర్డినెన్సులు తీసుకువచ్చింది.ఈ చట్టాలను కేబినెట్‌ సూత్రప్రాయం గా అంగీకారం తెలిపింది. కేబినెట్ మరోమారు పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంటుంది. ఈ కొత్త చట్టాల ప్రకారం అన్ని వయసుల స్త్రీలను మహిళగా నిర్వచించారు. ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం 15ఏళ్లలోపు స్త్రీలతో సంభోగాన్ని మాత్రమే రేప్‌గా పరిగణిస్తున్నారు.

బ్రిటన్ ప్రధానితో మోడీ సంభాషణ


అలాగే రేప్‌కు విధించే కెమికల్‌ కాస్ట్రేషన్‌ ప్రభావం కేసు స్వభావాన్ని అంటే తొలిసారి నేరం చేశారా లేక పదేపదే ఇలాంటి నేరాలు చేస్తున్నారా అనే విషయాన్ని బట్టి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం రేప్‌కేసులకు ప్రత్యేక కోర్టులతో పాటు యాంటీ రేప్‌ సెల్స్‌ను కూడా ఏర్పాటుచేస్తారు. అలాగే మహిళల కన్యత్వాన్ని పరీక్షించేందుకు చేసే టూ ఫింగర్‌ టెస్ట్‌ను నిషేధించనున్నారు.“అత్యాచారం యొక్క ప్రాథమిక నిర్వచనాన్ని మార్చే రేప్ వ్యతిరేక ఆర్డినెన్స్‌లను ఫెడరల్ క్యాబినెట్ ఆమోదించింది మరియు సామూహిక అత్యాచారం మరియు రేపిస్టులను ఉరి తీయడానికి కఠినమైన శిక్షను సూచిస్తుంది” అని సమాచారశాఖ మంత్రి షిబ్లి ఫరాజ్ క్యాబినెట్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో చెప్పారు.

సింధ్‌లో ఇటీవల ఒక తల్లి, ఆమె కుమార్తెపై జరిగిన అత్యాచార సంఘటనను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా పరిగణించిన తరువాత, నిందితులపై ఫాస్ట్ ట్రాక్ విచారణ, అత్యాచారానికి సమగ్ర నిర్వచనం, చేర్చడం వంటి సమగ్ర శాసనాలు సిద్ధం చేయాలని న్యాయ మంత్రి ఫరోగ్ నసీమ్‌ను కోరినట్లు ఫరాజ్ తెలిపారు.దోషులుగా నిర్ధారించబడిన రేపిస్టులకు కొత్త నేరాలు మరియు కఠినమైన శిక్షలు అమలు చేసేందుకు ఈ ఆర్డినెన్స్ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఆర్డినెన్స్‌లకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నందున, రేపిస్టులపై శిక్షాత్మక చర్యలకు పాల్పడినందున, ఆర్డినెన్స్ లో మరింత మెరుగుదల కోసం దీన్ని చట్ట విభాగానికి పంపినట్లు మంత్రి చెప్పారు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *