లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

భారత డ్రైవర్‌ను డిన్నర్‌కు ఆహ్వానించిన పాక్ క్రికెటర్లు

Published

on

Pakistan cricketers invite Indian cab driver to dinner after he refused to take money from them

పాకిస్తాన్ క్రికెటర్లు భారత డ్రైవర్ ను డిన్నర్ కు ఆహ్వానించారు. షహీన్ షా అఫ్రీదీ, యాసిర్ షా, నసీమ్ షాలను బ్రిస్బేన్ నుంచి హోటల్‌కు వెళ్లేందుకు భారత ట్యాక్సీ డ్రైవర్‌ కార్లో తీసుకెళ్లాడు. దిగిన తర్వాత డబ్బులు ఇస్తుండగా డ్రైవర్ తిరస్కరించాడు. అభిమానంతో తాను వారి దగ్గర డబ్బులు తీసుకోలేనన్నాడు. 

దాంతో డిన్నర్ కు వెళ్తున్న వారు డ్రైవర్ ను కూడా తమ వెంట తీసుకెళ్లారు. వారంతా బ్రిస్బేన్ నుంచి ఓ భారత రెస్టారెంట్ కు డిన్నర్ కోసం వెళ్లారు. ఈ విషయాన్ని ఏబీసీ రేడియో ఛానెల్లో అలిసన్ మిచెల్, ఆస్ట్రేలియా మాజీ ఫేసర్ మిచెల్ జాన్సన్‌కు చెప్తూ ప్రస్తావించాడు. 

వారిద్దరూ మాట్లాడుకుంటున్న వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. శుక్రవారం నుంచి అడిలైడ్ లోని ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్తాన్ లు తలపడుతున్నాయి. రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్‌ భాగంగా రెండో టెస్టును అజహర్ అలీ కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు ఆడుతోంది. 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *