దాడి చేస్తే..భారత్ పై అణుబాంబుతో దాడి చేస్తాం – షేక్ రషీద్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత్ మీద దాయాది దేశం పాక్ కయ్యానికి కాలు దువ్వుతోంది. తమ దేశంపై భారత్ దాడి చేస్తే..అణుబాంబులతో దాడి చేస్తామని ఆ దేశ మంత్రి షేక్ రషీద్ సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. భారత సైన్యంతో పోలిస్తే…పాక్ సైన్యం వెనుకబడి ఉందని..అందుకే చిన్నస్థాయి అణుబాంబుల తయారీకి ప్రయత్నిస్తున్నామన్నారు.ఓ ఛానెల్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ పై అణుబాంబులేసినా..అక్కడి ముస్లింలను రక్షిస్తామన్నారు. ఇది చివరి యుద్ధం కావొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇండియాలోని కొన్ని ప్రాంతాలను గుర్తిస్తామని..అస్సాం వరకు టార్గెట్ చేస్తామన్నారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం రషీద్ కు కొత్తేమీ కాదు. 125 నుంచి 250 గ్రాముల అణ్వాయుధాలున్నాయన, నిర్దేశిత లక్ష్యాలని చేధిస్తాయన్నారు. ఈయన్ను పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ గళంగా భావిస్తారు.రెండు దేశాలు అణ్వాయుధ యుద్ధానికి దిగితే ప్రపంచం మొత్తానికి నష్టం జరుగుతుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అప్పట్లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.


Related Posts